Indian Rupee Drops: దేశీ కరెన్సీ రూపాయి విలువ అత్యంత భారీగా పతనమైంది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి పడిపోయింది. డాలర్ మారకంతో పోలిస్తే మంగళవారం (జూలై 19) రూపాయి విలువ 80.06కి చేరింది. డిసెంబర్, 2014 నుంచి ఇప్పటివరకూ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 25 శాతం మేర క్షీణించింది. ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 7 శాతం మేర రూపాయి విలువ పతనమైంది.
దేశీ ఈక్విటీ మార్కెట్ నుంచి దాదాపు 30 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు ఉపసంహరించబడ్డాయి. దానికి తోడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. ఇవన్నీ కలిసి రూపాయి విలువపై ప్రభావం చూపాయి. భారత్ చేసే ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉండటం.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటం రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ డాలర్‌పై పెట్టుబడికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దిగుమతుల కోసం భారత్ మరింత ఎక్కువ డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచడంతో పాటు విదేశీ నిల్వలు తగ్గిపోయేలా చేస్తుంది. కేవలం భారత్ మాత్రమే కాదు బ్రిటన్, జపాన్‌లు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని కేంద్రం చెబుతోంది. మన రూపాయి కన్నా బ్రిటన్ కరెన్సీ పౌండ్, జపాన్ కరెన్సీ యెన్ మరింత పతనమయ్యాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మరోవైపు, రూపాయి పతనంపై కేంద్రం విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ అసమర్థ విధానాల వల్లే దేశీ కరెన్సీ నానాటికి దిగజారుతోందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ రూపాయి విలువ పతనంపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రూపాయి విలువ ఎందుకు పడిపోతున్నదో మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుల జీవన స్థితిగతులు దిగజారాయని.. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే మరింత దుర్భర పరిస్థితులు ఎదురవుతాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read:Srinu Vaitla: ఆ హీరోయిన్ వల్లే విడాకుల దాకా శ్రీను వైట్ల వ్యవహారం?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook