Controversy Over Neet Dress Code: నీట్ పరీక్షలో డ్రెస్ కోడ్ అంశం వివాదాస్పదమవుతోంది. పరీక్షా కేంద్రాల్లో డ్రెస్ కోడ్ పేరిట విద్యార్థినులను మానసికంగా హింసించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినుల చేత బలవంతంగా లోదుస్తులు తీయించి పరీక్షకు అనుమతించిన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. మీకు లోదుస్తులు ముఖ్యమా.. లేక మీ భవిష్యత్తు ముఖ్యమా అంటూ అక్కడి మహిళా సిబ్బంది విద్యార్థినుల పట్ల బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. ఈ వ్యవహారంపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల కమిషన్ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది.
కొల్లాంకు చెందిన ఆ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో అతని కూతురు నీట్ పరీక్ష రాసింది. అయితే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే సమయంలో లోదుస్తులు తీసి వెళ్లాలని అక్కడి మహిళా సిబ్బంది ఆమెను కోరారు. విద్యార్థిని ధరించిన బ్రాకి ఉన్న హుక్ కారణంగా మెటల్ డిటెక్టర్‌లో బీప్ సౌండ్ వచ్చింది. దీంతో లోదుస్తులు తొలగిస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అలా చేయక తప్పలేదు.
నిజానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన డ్రెస్ కోడ్ గైడ్ లైన్స్‌లో లోదుస్తులు తొలగించాలనే విషయం లేదని ఫిర్యాదులో ఆ వ్యక్తి పేర్కొన్నారు. మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌లో పరీక్ష రాసిన 90 శాతం మంది విద్యార్థినుల చేత ఇలాగే బలవంతంగా లోదుస్తులు తీసేయించారని ఆరోపించారు. విద్యార్థినులంతా స్టోర్ రూమ్‌లో లోదుస్తులను విప్పి పరీక్షా హాల్‌లోకి వెళ్లినట్లు చెప్పారు.
పరీక్షా కేంద్రం వద్ద సిబ్బంది వ్యవహరించిన తీరు విద్యార్థినులను మానసికంగా డిస్టర్బ్ చేసిందని.. అది పరీక్షపై కూడా ప్రభావం చూపిందని అన్నారు. ఆ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. అతని కూతురి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేయనున్నారు.
కేంద్రానికి లేఖ రాయనున్న కేరళ సర్కార్:
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్‌టీఏకి లేఖ రాయనున్నట్లు కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు తెలిపారు. నీట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థినుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన ఎన్‌టీఏ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. పలువురు సామాజిక కార్యకర్తలు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేయడం, వారి హక్కులను కాలరాయడమేనని యాక్టివిస్ట్ బృందా మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Also Read:
Horoscope Today July 19th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి ఇవాళ శుభదినం... Also Read: Astro puja tips: ఈ 5 పూజా వస్తువులు చేజారి కింద పడ్డాయా? అయితే మీకు ఆపదలు తప్పవు.. స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook |