MLA Sethakka: దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ కేంద్రంలో అనూహ్య ఘటన జరిగింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాకిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా ఎన్డీఏ అభ్యర్థికి ఆమె ఓటు వేశారు. బీజేపీ బలపర్చిన ద్రౌపది ముర్ముకు ఓటేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరులురాలిగా ఉన్న సీతక్క.. కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా బీజేపీ క్యాండిడేట్ కు ఓటేయం కాంగ్రెస్ వర్గాలను షాకింగ్ కు గురి చేసింది.
అయితే తాను ఓటు వేయడంలో పొరపాటు పడ్డానని ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. యశ్వంత్ సిన్హాకు వేయబోయి పొరపాటున ద్రౌపది ముర్ముకు వేశానని చెప్పారు. పొరపాటు జరిగిందని.. తనకు మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని కోరారు. మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, అధికారులు మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ఆ బ్యాలెట్ పేపర్‌పైనే తన ఓటు వేసి, బ్యాలెట్ బాక్సులో వేశారు సీతక్క. ఇదే విషయాన్ని ఓటు వినియోగించుకున్న అనంతరం ఆమె తెలిపారు.
ఓటు వేయడంలో తాను ఎలాంటి పొరపాటు చేయలేదన్నారు సీతక్క. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ పొరపాటున బ్యాలెట్ పేపర్‌పై పడిందన్నారు. ఈ విషయాన్నే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదని.. దీంతో ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్ నే బాక్స్‌లో వేశానని సీతక్క వెల్లడించారు. తన ఆత్మ సాక్షిగా తాను వేయాలకున్నవారికే ఓటు వేశానని వివరించారు. అయితే తన ఓటు చెల్లుతుందా లేదా అనేది ఎన్నికల అధికారులే తేల్చుతారని చెప్పారు.
Read also: TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Read also: Cloud Busrt: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా? గోదావరిపై కుట్ర జరిగిందా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.