Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి

Hyderabad Road Accident: హైదరాబాద్‌లో బైక్ యాక్సిడెంట్ ఇద్దరి యువకుల ప్రాణాలు బలితీసుకుంది. అతివేగంతో దూసుకెళ్లిన యువకులు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 15, 2022, 03:01 PM IST
  • హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
  • సోమాజిగూడ వద్ద మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన యువకులు
  • ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి

Hyderabad Road Accident: హైదరాబాద్‌లో అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు బలితీసుకుంది. బైక్‌పై అతివేగంతో దూసుకెళ్లిన యువకులు సోమాజిగూడ సమీపంలో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్ (23)లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరు యువకులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా సోమాజిగూడ ఆలయం సమీపంలో అతివేగంతో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 

మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. తప్రమాద ఘటనపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. యువత అతివేగంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

Also Read: Bhadrachalam Godavari Floods LIVE*: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్.. ఈ మధ్యాహ్నం 3 గంటలకు 73 అడుగులకు చేరుతుందని అంచనా

Also Read: Hyderabad Traffic: ఎల్లుండి సికింద్రాబాద్‌లో బోనాల జాతర..ట్రాఫిక్‌ మళ్లింపులు ఇవే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News