Telangana Rain Updates: తెలంగాణలో దాదాపు వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గడిచిన 3,4 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం (జూలై 11) ఉదయం కొన్ని ప్రాంతాల్లో తెరిపినిచ్చిన వాన.. కాసేపటికే మళ్లీ జోరందుకుంది. తేలికపాటిగా మొదలై క్రమంగా భారీ వర్షంగా మారింది. రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది.
వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం... రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్, జనగాం, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, నల్గొండ, యాదాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ బేగంపేట వాతావరణ శాఖ కేంద్రం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా జనాలు బయటకు రాకపోవడంతో షాపుల్లో గిరాకీ ఉండట్లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మరో 2, 3 రోజుల వరకు వర్ష సూచన ఉండటంతో చాలామంది ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటున్నారు.
తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చే ప్రాణహిత, ఇంద్రావతి నదుల వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కాళేశ్వరం గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ భారీ వరదతో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఇప్పటికే అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. గోదావరికి భారీ వరద కారణంగా విలీన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 11, 2022
Also Read: Horoscope Today July 12th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాల పంట పండుతుంది..
Also Read: Telangana Eamcet-2022: 14 నుంచి ఎంసెట్ పరీక్ష యధాతథం..ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook