Fourth wave alert: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం... కొత్త కేసులు ఎన్నంటే?

India Covid-19 Update: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 2,500కుపైగా కేసులు నమోదయ్యాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 10:22 AM IST
  • దేశంలో కొవిడ్ విజృంభణ
  • 19వేలకు చేరువలో కరోనా కేసులు
  • పెరిగిన మరణాల సంఖ్య
Fourth wave alert: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం... కొత్త కేసులు ఎన్నంటే?

India Covid-19 Update: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,930 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ తో 35 మంది మరణించారు.  కరోనా నుంచి 14,650 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,19,457 కొవిడ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 4,29,21,977గా ఉండగా... టోటల్ మరణాల సంఖ్య 5,25,305గా ఉంది. నిన్న 4,38,005 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం 11,44,489 మందికి కొవిడ్ టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,98,33,18,772కు చేరింది. దేశంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వరల్డ్ వైడ్ గా తాజాగా 9,52,758 మందికి వైరస్ సోకింది. మరో 1,585 మరణాలు చోటుచేసుకున్నాయి. ఫ్రాన్స్ లో 1,54,615 మంది వైరస్ బారిన పడగా...మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీ​లో 1,35,402 కేసులు వెలుగుచూశాయి. మరో 108 మంది మరణించారు. 

Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News