Anemia: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి శరీరంలో రక్తం కొరత సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు శరీరం పట్ల శ్రద్ధ వహించకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఎండు ద్రాక్షను తీసుకోవాలిని చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో రక్తంలో కొరతను తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ ద్రాక్షలో తేనె కలుపుకుని తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండు ద్రాక్షలో తేనె కలిపి తినడం వల్ల ప్రయోజనాలు:
ఎండు ద్రాక్ష, తేనెలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాహారం అందడమే కాకుండా.. రోగాలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలపై ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ రెండింటిలో కాల్షియం, ఐరన్‌తో పాటు అవసరమైన పోషకాల లక్షణాలు ఉంటాయి. వీటిని తినాలంటే ముందుగా 6-7 ఎండు ద్రాక్షలను రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఎండు ద్రాక్షలో తేనె మిక్స్ చేసి తినాలి.
ఈ రెండు కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ఈ మిశ్రమం శరీరంలోని రక్తహీనతను దూరం చేయడమే కాకుండా.. రక్తపోటు నియంత్రిస్తుంది.
2. రక్తపోటు నియంత్రణలో లేని వ్యక్తులు ఎండుద్రాక్ష, తేనె తప్పనిసరిగా తీసుకోవాలి.
3. జీర్ణవ్యవస్థను పటిష్టంగా మార్చడానికి కృషి చేస్తుంది.
4. కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
5. రక్త ప్రసరణను మెరుగుపరుతుంది
6. చర్మ సమస్యలను దూరం చేస్తుంది
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!
Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook