/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Kotamreddy Sridhar Reddy stage Protest In Drain water In Nellor: ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తారనే టాక్ ఉంది. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అంటే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఏ చెప్పినా వెంటనే చేసేస్తుంటారు. కాని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ మారోలా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఎన్నిసార్లు తమ సమస్య గురించి చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు ఎమ్మెల్యేను ఆశ్రయించారు. దీంతో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆదేశించారు.

తాను చెప్పినా అధికారులు స్పందించకపోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆగ్రహానికి లోనయ్యారు. అధికార పార్టీ సభ్యుడైనా రోడ్డెక్కారు. సమస్య పరిష్కారం కోసం వినూత్న నిరసనకు దిగారు. అయితే నిరసనలో భాగంగా ఎమ్మెల్యే ఎవరూ ఊహించని పని చేశారు. అధికారులకు చెమటలు పట్టించారు.డ్రైనేజీ సమస్య పరిష్కారం కావడంతో ఏకంగా డ్రైనేజీలోకి దిగారు. డ్రైనేజీలో కూర్చుని నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇటీవల గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లారు శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలోనే ఉమ్మారెడ్డి గుంటలో పర్యటించిన ఆయనకు స్థానికులు డ్రైనేజీ సమస్య గురించి చెప్పారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించమని చాలా రోజులుాగ అధికారులకు చెబుతూ వస్తున్నారు ఎమ్మెల్యే. తనను ప్రజలు నిలదీయడంతో అధికారులకు తీరుకు నిరసనగా ఇలా నిరసనకు దిగారు.

మూడేళ్లుగా డ్రెయినేజీ సమస్యపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పారు.  అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని చెప్పారు. ప్రజల సమస్యను పరిష్కరించే బాధ్యత తనపై ఉందన్నారు శ్రీధర్ రెడ్డి. ఎగువ ప్రాంతాల నుంచి  మురుగునీరు వస్తుండటంతో ఉమ్మారెడ్డి గుంటలో డ్రెయినేజీ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. దీనిపై గత మూడేళ్ళుగా అధికారులతో మాట్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తానెప్పుడు  ప్రజల పక్షాన ఉంటానని.. ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.  

జగన్ కేబినెట్ లో చోటు ఆశించిన శ్రీధర్ రెడ్డికి చుక్కెదురైంది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కొన్ని రోజులుగా ఆయన సంచలన ప్రకటనలు చేస్తూ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నారు. వైసీపీలో కలకలం స్పష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రైనేజీలో దిగి నిరసన తెలపడం ప్రాధాన్యాత సంతరించుకుంది. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపేలా శ్రీధర్ రెడ్డి వ్యవహరించారని.. ఆ విధంగా జగన్ పై ఆయన తన వ్యతిరేకత ప్రదర్శించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

Read also: Mega Brothers: మెగా బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టిందెవరు..! జగన్ కు చిరంజీవి ఎందుకు దగ్గరయ్యారు?

Read also: Heavy Rains: తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత   

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
YSRCP MLA Kotamreddy Sridhar Reddy stage Protest In Drain water In Nellore
News Source: 
Home Title: 

Kotamreddy Sridhar Reddy: డ్రైనేజీలోకి దూకిన వైసీపీ ఎమ్మెల్యే... సీఎం జగన్ పై అలా కసి తీర్చుకున్నారా?

 

Kotamreddy Sridhar Reddy: డ్రైనేజీలోకి దూకిన వైసీపీ ఎమ్మెల్యే... సీఎం జగన్ పై అలా కసి తీర్చుకున్నారా?
Caption: 
Kotamreddy Sridhar Reddy (FILE PHOTO )
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఏపీ సీఎం జగన్ కు సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్

డ్రైనేజీలోకి దూకి నిరసన తెలిపిన శ్రీధర్ రెడ్డి

అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్

Mobile Title: 
Sridhar Reddy: డ్రైనేజీలోకి దూకిన వైసీపీ ఎమ్మెల్యే.. జగన్ పై అలా కసి తీర్చుకున్నారా?
Srisailam
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 5, 2022 - 17:34
Request Count: 
46
Is Breaking News: 
No