Eoin Morgan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌!

Eoin Morgan announce retirement from international cricket Today. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 28, 2022, 07:52 PM IST
  • ఇయాన్‌ మోర్గాన్‌ సంచలన నిర్ణయం
  • క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మోర్గాన్‌
  • కొంత కాలం పేలవ ప్రదర్శన
Eoin Morgan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌!

England captain Eoin Morgan announce retirement from international cricket: టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలం పేలవ ప్రదర్శన, ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతమవుతున్న మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. 2009లో ఇంగ్లండ్ తరఫున ఆడడం మొదలెట్టిన మోర్గాన్‌.. 13 సంవత్సరాల పాటు అభిమానులను అలరించాడు. మోర్గాన్‌ సారథ్యంలోనే ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. 

35 ఏళ్ల ఇయాన్‌ మోర్గాన్‌ ఇంగ్లండ్ తరపున 16 టెస్టులు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. మోర్గాన్ 16 టెస్టుల్లో 700 రన్స్ బాదాడు. సంప్రదాయ ఫార్మాట్లో 2 శతకాలు, 3 అర్ధ సెంచరీలు చేశాడు. 248 వన్డేల్లో 7701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 115 టీ20ల్లో 14 హాఫ్ సెంచరీలతో 2458 పరుగులు చేశాడు. మోర్గాన్ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు నాయకత్వం వహిస్తాడని అనుకున్న అందరి అంచనాలను తలక్రిందులు చేశాడు. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు చివరిసారిగా ఆడాడు. 

నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇయాన్‌ మెర్గాన్‌ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌ అయ్యాడు. ఇక గాయం కారణంగా అఖరి వన్డేకు అతడు దూరమ్యాడు. మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న నేపథ్యంలో వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2015 నుంచి వైస్‌ కెప్టెన్‌గా బట్లర్‌ ఉంటున్నాడు. ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య త్వరలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు బట్లర్‌ నాయకత్వం వహించనున్నాడు. 

ఇయాన్‌ మోర్గాన్‌ స్వదేశం ఐర్లాండ్‌. 2006లో ఐర్లాండ్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. స్కాట్లాండ్‌తో ఆడిన తొలి వన్డేలోనే 99 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 2007లో కెనడాపై తొలి సెంచరీ బాదాడు. 2007 టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనా.. పరుగులు చేయలేకపోయాడు. ఐర్లాండ్‌ జట్టు తరఫున 23 వన్డేలు ఆడిన మోర్గాన్ 744 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్ జట్టుకు ఆడడం మొదలెట్టాడు. 2012 వరకు మూడు ఫార్మాట్లో ఆడి.. టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. 2015 వన్డే ప్రపంచకప్‌కు కెప్టెన్ అయిన మోర్గాన్.. 2019 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టుకు అందించాడు. దాంతో ఏ ఇంగ్లీష్ సారథికి సాధ్యంకాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Also Read: Varinder Singh Dead: భారత హాకీ దిగ్గజం కన్నుమూత!

Also Read: Plant Vastu Tips: ఈ మెుక్క ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News