Fruits and Seeds: ఆరోగ్యమనేది మనం తీసుకునే ఆహార పదార్ధాల్ని బట్టి ఉంటుంది. అందుకే డైట్లో పండ్లను కచ్చితంగా చేర్చుకోవాలి. అయితే కొన్ని పండ్లు తినేటప్పుడు..విత్తనాల్ని కచ్చితంగా దూరం చేయాలి. లేకపోతే సమస్యలు ఎదురౌతాయి.
మెరుగైన ఆరోగ్యం కోసం వైద్యులు పండ్లు తీసుకోమని సూచిస్తుంటారు. వీలైతే రాత్రి వేళ భోజనం మానేసి పండ్లను తినమంటుంటారు. అందుకే వివిధ రకాల పండ్లను డైట్లో చేరుస్తుంటారు., కానీ కొన్ని రకాల పండ్ల విత్తనాలు మాత్రం ఆరోగ్యానికి హానికరమని చాలామందికి తెలియదు. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఆ విత్తనాలు ఏ పండ్లవో తెలుసుకోవడం చాలా అవసరం. ఇక నుంచి ఆ పండ్లు తినేటప్పుడు విత్తనాల్ని పూర్తిగా తొలగించి తినడం అలవాటు చేసుకోండి.
యాపిల్ ఎ డే..కీప్ డాక్టర్ ఎవే అంటారు పెద్దలు.యాపిల్ అనేది ఆరోగ్యానికి అంత మంచిది. ఇందులో ఉండే పౌష్ఠిక గుణాలు చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. కానీ యాపిల్ విత్తనాలు మాత్రం చాలా ప్రమాదకరం. ఈ విత్తనాల్లో సైనైడ్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇక రెండవది పీచ్ ఫ్రూట్. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతమంచిదో విత్తనం అంత ప్రమాదకరం. విత్తనం పొరపాటున కూడా తినకూడదు.
ఇక అల్బుఖ్రా లేదా ప్లమ్ ఫ్రూట్ అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అది అన్ సీజనల్ ఫ్రూట్ కావడంతో ఎప్పుడైనా తినవచ్చు. అయితే దీని విత్తనాలు తినకూడదు. ఆరోగ్యానికి హానికరం. ఇక మరో ఫ్రూట్ చెర్రీ. యాపిల్‌లానే చెర్రీ విత్తనాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ విత్తనాల్లో ఉండే పోషక పదార్ధం ఆరోగ్యాన్ని వికటించేలా చేస్తుంది. ఇక అన్నింటికంటే అద్భుతమైన మరో ఫ్రూట్ ఆప్రికాట్ లేదా ఖుబానీ పండ్లు ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో దీని విత్తనం అంత హానికారకం. విత్తనాలు పొరపాటున కూడా తినకూడదు.
Also read: Pudina Benefits: పుదీనాను ఇలా వాడితే చాలు..అజీర్ణం, కడుపు నొప్పి సమస్యలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి