Sheep and Donkey tease his Owner for food: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, మొసళ్లు, పాములు, కుక్క ఇతర జంతువులకు సంబంధించి వీడియోలు ట్రెండింగ్‌లో ఉంటాయి అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. తాజాగా ఓ గొర్రె, గాడిదకు సంబందించిన ఫన్నీ వీడియో నవ్వులు తెప్పిస్తోంది. ఇందులో గాడిద పని చూస్తే ఏడ్చే వ్యక్తి కూడా నవ్వడం పక్కా.
ఈ ఫన్నీ వీడియో ఓ యజమాని మరియు అతని పెంపుడు జంతువులకు సంబంధించినది. ఒక గొర్రెల కాపరి తన పెంపుడు జంతువును గుట్టల ప్రాంతంలోకి మేతకు తీసుకెళతాడు. గొర్రెలను ఓ మందంగా చేసి ఓ వైపు.. తన పెంపుడు గాడిదను మరోవైపు ఉంచుతాడు. ఆపై ఆ గొర్రెల కాపరి తన కోసం చపాతీ చేసుకుని.. టీ వేడిచేస్తుంటాడు. ఆ సమయంలో వెనకాల నుంచి వచ్చిన ఓ గొర్రె చపాతీ తినేస్తుంది. ఇది చూసిన అతడు దాన్ని అక్కడినుంచి పంపేందుకు దూరంగా వెళతాడు. ఇంతలో గాడిద వచ్చి ఇంకో చపాతీ తీసుకుంటుంది.
గాడిద చపాతీ తినడం చూసిన ఆ గొర్రెల కాపరి దాన్ని అక్కకి నుంచి వెళ్లగొట్టేందుకు వస్తాడు. చపాతీ తింటున్న ఆ గాడిద.. తన వెనకాల కాళ్లతో అతన్ని తన్నడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో గొర్రె కూడా వచ్చి మరో చపాతీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా. అతడు దాన్ని ఆపి అక్కడి నుంచి పంపించేస్తాడు. మొత్తానికి గొర్రె, గాడిద కలిసి తమ యజమానిని ఓ ఆటాడుకుంటాయి.
Sharing his food😂 pic.twitter.com/0CZLzV3TO0
— Tansu YEĞEN (@TansuYegen) June 15, 2022
TansuYegen అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ వీడియో షేర్ చేయబడింది. వీడియో క్యాప్షన్‌లో 'నా ఆహారాన్ని ఎత్తుకెళుతున్నాయి' అని పేర్కొన్నారు. 34 సెకన్ల నిడివి గల ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో దాదాపు 400 రీట్వీట్ చేయబడింది. అంతేకాదు దాదాపు 2000 లైక్‌లు కూడా వచ్చాయి.
Also Read: Ranji Trophy 2022: సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా ఉండడం బాగుంది: యువ క్రికెటర్
Also Read: Umpire Catch: క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన అంపైర్.. చివరికి ఏమందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook