Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నేటి రాత్రి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి అవసరాలపై తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్ళ వద్దని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు విజ్ఞప్తిచేశారు.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తిన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ 040-21111111 ను సంప్రదించాలని హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి కోరారు.
ఇదిలావుంటే, మరోవైపు ఇప్పటికే జీహెచ్ఎంసీలోని (GHMC) విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవల బృందాలు లోతట్టు ప్రాంతాలు, నాలాలు ప్రవహించే ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. అవసరం ఉన్నచోట మరమ్మతులు చేపట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయా బృందాలు కృషిచేస్తున్నాయి.
Also read : BJP Meeting: ప్రధాని మోదీ బహిరంగసభతో తెలంగాణ బీజేపీలో జోష్ వచ్చేనా..?
Also read : Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తప్పనిసరి అయితేనే బయటికి రండి.
ఇటీవల నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు
జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాలు
నగరవాసులకు మేయర్ విజయలక్ష్మి సూచన