International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. యోగా దినోత్సవం పురస్కరించుకుని స్నేహితులు, బంధువులకు పంపించే శుభాకాంక్షలు, క్వొటేషన్లు, మెస్సేజిల గురించి తెలుసుకుందాం..
ప్రతియేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అత్యంత ఘనంగా జరుపుకుంటారు. యోగా ప్రాధాన్యతను నలుగురికీ తెలిసేలా చేయడమే యోగా దినోత్సవం ఉద్దేశ్యం. యోగా అనేది ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా..రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యోగా గురించి నలుగురికీ తెలిసేలా, యోగా ప్రాధాన్యత, యోగా ప్రయోజనాలు అర్ధమయ్యేలా సందేశాలు పంపిస్తుంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జూన్ 21న మీరు మీ స్నేహితులు, బంధువులు, హితులకు యోగాకు సంబంధించి ఏయే మెస్సేజీలు పంపిస్తే బాగుంటుందో పరిశీలిద్దాం..
ప్రతి దినం ఉదయం సాయంత్రం యోగా
దరిచేరదు ఎప్పుడూ ఏ రోగం
మతం కాదు ఇదొక జ్ఞానం
శ్రేయస్సు కోరేది..యౌవనం తెచ్చేది యోగా
శరీరాన్ని మనస్సు..ఆత్మతో కలిపేది యోగా
రోజూ చేయండి యోగా
ఏ రోగం మీ వరకూ చేరదు ఇక
ఆరోగ్యానికి ప్రయోజనకరం
రోగ రహిత జీవితం కోసం యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
యోగా ఒక సంగీతం..ఒక శరీరపు లయ
మనస్సు - ఆత్మ చేసే మిశ్రమ ధ్వని ఇది
ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
మనిషి శరీరాన్ని రోగాలకు దూరం చేసేది యోగా
మానసిక, శారీరక పటిష్టత యోగాతో సాధ్యం
ప్రశాంతత, ఆరోగ్యం యోగా లక్షణం
అందరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు
Also read: Cucumber Drink Benefits: దోసకాయల డ్రింక్‌తో ఇలా సులభంగా బరువును తగ్గించుకోండి..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook