Home Loan Checklist: సొంతిళ్లు కట్టుకోవాలని..లేదా కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరి కల. సగటు మనిషి కల కాబట్టే బ్యాంకులు రుణాలందించేందుకు పోటీపడుతుంటాయి. ఇంటి రుణం కోసం అప్లే చేసేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవల్సిన విషయాలివే...
మీరేమైనా ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ..హోమ్‌లోన్ కోసం అప్లై చేయనున్నారా..అయితే ఇది మీ కోసమే. హోమ్‌లోన్ కోసం అప్లై చేసేముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. హోమ్‌లోన్ అప్లై చేసేముందు ఈ కొన్ని పనుల్ని చేస్తే.. తరువాత మీకు ఏ విధమైన సమస్యలు ఎదురుకావు. అవేంటో తెలుసుకుందాం. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో హోమ్ లోన్ ఈఎంఐలు భారంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు అన్ని బ్యాంకులు పెంచుతున్నాయి. ముందు వడ్డీ రేటు ఎలా ఉందో పరిశీలించండి.
ఒకవేళ మీరు ఎక్కువ రుణం కోసం దరఖాస్తు చేస్తే..బ్యాంకు తిరస్కరించే అవకాశాలున్నాయి. మీకు ఎంతవరకూ రుణం పొందే అర్హత ఉందనేది తెలుసుకోండి. అలా తెలుసుకున్న తరువాత డౌన్‌పేమెంట్ కోసం ప్లాన్ చేసుకోండి. మీకు లభించే రుణ పరిమితిని బట్టి మీరు మిగిలిన డబ్బులు సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది. ఇక మరో ముఖ్య విషయం.. మీరు ఎక్కడైతే ఇళ్లు లేదా ఫ్లాట్ తీసుకుంటున్నారో..దానికి సంబంధించి అన్నిరకాల రెగ్యులేటరీ క్లియరెన్స్ ఉందో లేదో చూసుకోండి. బ్యాంక్ లిస్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాంకుకు అప్రూవ్డ్ ప్రోజెక్ట్ లిస్ట్ ఉటుంది. లేకపోతే హోమ్‌లోన్‌పై ప్రభావం పడవచ్చు. కొన్ని చిన్న ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలు రెప్కో, పిరమిల్ గ్రూప్ వంటివి రుణాలిచ్చినా...తరువాత సమస్యగా మారవచ్చు.
సాధ్యమైనంతవరకూ మీ సేవింగ్ లేదా సేలరీ అక్కౌంట్ ఉన్న బ్రాంచ్‌లోనే హోమ్‌లోన్ కోసం అప్లై చేయడం మంచిది. మీ క్రెడిట్ హిస్టరీ బ్యాంకుకు ముందు నుంచీ తెలిసుంటే..రుణం తీసుకోవడం సులభమవుతుంది. ఎక్కువ సందర్భాల్లో మీ రీ పేమెంంట్ హిస్టరీ, మంచి క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ హోమ్‌లోన్ మంజూరు చేస్తుంటుంది. దీనివల్ల మీ హోమ్‌లోన్ త్వరగా మంజూరవుతుంది. చాలా సందర్భాల్లో మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ త్వరగా లభిస్తుంది.
ఒకవేళ మీకు ఎక్కువ హోమ్‌లోన్ కావల్సి ఉన్నా..మీ శాలరీ ప్రకారం అర్హత ఉండదు. ఆ సందర్భాల్లో మీ భార్య, తల్లిదండ్రులు, సోదరుడు లేదా సోదరితో జాయింట్‌గా తీసుకోవచ్చు. లోన్ రీ పేమెంట్ కోసం ఎక్కువ టెన్యూర్ తీసుకోవచ్చు.
Also read: SBI Interest Rates: ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.