Indonesia Open 2022: తొలి రౌండ్‌లోనే ఓటమి.. ఇండోనేషియా ఓపెన్ నుంచి సింధు, ప్రణీత్ అవుట్!

Indonesia Open 2022, PV Sindhu and Sai Praneeth crash out. ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ తొలి రౌండ్‌లోనే భారత స్టార్ షట్లర్లు సింధు, ప్రణీత్ ఓటములు చవిచూశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 06:26 PM IST
  • తొలి రౌండ్‌లోనే ఓటమి
  • పీవీ సింధుకు ఊహించని షాక్
  • ఇండోనేషియా ఓపెన్ నుంచి ప్రణీత్ అవుట్
Indonesia Open 2022: తొలి రౌండ్‌లోనే ఓటమి.. ఇండోనేషియా ఓపెన్ నుంచి సింధు, ప్రణీత్ అవుట్!

PV Sindhu and Sai Praneeth crash out from Indonesia Open 2022: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్‌కు ఊహించని షాక్ తగిలింది. జకార్తాలోని ఇస్తోరా వేదికగా మంగళవారం జరిగిన ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ తొలి రౌండ్‌లోనే సింధు, ప్రణీత్ ఓటములు చవిచూశారు. మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్‌లో సింధు 14-21, 18-21 తేడాతో చైనాకు చెందిన హె బింగ్ జియావో చేతిలో ఓడిపోయింది. 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో సింధు తమ మార్క్ ఆట చూపలేక మూల్యం చెల్లించుకుంది. 

తొలి రౌండ్ మ్యాచ్‌లో 7వ సీడ్ పీవీ సింధు.. 9 ర్యాంకు హీ బింగ్ జియావోతో తలపడాల్సి వచ్చింది. ఎడమచేతి వాటం చైనా షట్లర్ ధాటికి సింధు ఓపెనింగ్ గేమ్‌లో 2-9తో వెనకబడిపోయింది. పుంజుకున్న తెలుగు తేజం 10-12తో నిలిచింది. ఈ సమయంలో చెలరేగిన జియావో.. 14-21తో తొలి గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్‌లో కూడా ఆధిపత్యం కొనసాగించిన చైనా షట్లర్ 18-21 గేమ్‌తో పాటుగా మ్యాచును కైవసం చేసుకుంది. ఈ ఓటమితో సింధు ఇండోనేషియా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. 

గతవారం ముగిసిన సూపర్ 500 టోర్నమెంట్ ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు 12-21, 10-21తో రచ్చనోక్ ఇంటనాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత షట్లర్ గత రెండు వారాలుగా జకార్తాలో పేలవ ఆటతో అభిమానులను నిరాశపరిచింది. వచ్చే నెలలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు సింధు మళ్లీ మునపటి ఫామ్‌ను అందుకోవాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.

16వ సీడ్ సాయి ప్రణీత్ కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో డెన్మార్క్ ఆటగాడు హాన్స్ క్రిస్టియన్ విట్టింగుస్ చేతిలో ప్రణీత్ ఓడిపోయాడు. 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 16-21, 19-21తో వరుస సెట్లలో ఓడిపోయాడు. దాంతో ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లోనే ఇద్దరు భారత స్టార్ షట్లర్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో క్రీడాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bhuvneshwar Kumar T20 Record: మరొక్క వికెటే.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న భువనేశ్వర్‌ కుమార్!  

Also Read: భారీగా పెంచేసిన న‌జ్రియా న‌జీమ్.. స్టార్ హీరోయిన్‌లకు సమానంగా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News