Cholesterol Control dry fruits: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనేక రకాల స్ట్రీట్ ఫుడ్ తినడంతో చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇదే క్రమంలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. శరీరంలో చెడు కొవ్వు నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల మార్గాలున్నాయి. శరీరంలో కొవ్వు పరిమాణం తగ్గడానికి డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి మానవుని శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి.
ప్రతి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బాడీలో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.
వాల్‌నట్స్‌ను తినండి:
వాల్‌నట్స్ శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు దోహదపడతాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తాయి.
బాదం పప్పును రోజూ తినడం అలవాటు చేసుకోండి:
శరీరంలో ఫిట్‌గా ఉండాలంటే రోజూ బాదంపప్పు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బాదంపప్పులో అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల.. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను తయారు చేసి చెడు కొలెస్ట్రాల్‌ను త్వరగా తగ్గిస్తాయి.
పిస్తా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:
చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా పిస్తాపప్పును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
విత్తనాలు:
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిండానికి విత్తనాలు కూడా దోహదపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS ఈ ప్రిస్క్రిప్షన్‌లను ఆమోదించదు.)
Also Read: Raghunandan Comments: ఆలయాల ఆదాయంతో మసీదుల నిర్మాణం! కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.