Saturn Retrograde Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం జూలైలో వక్రమార్గం పడుతూనే రాశి మారనుంది. శని గోచారంతో పాటు మిధునం, తుల రాశులు మరోసారి శని బారిన పడనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం రాశి మారడమనేది ఇతర రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. శని గ్రహం ఏప్రిల్ 29న తన కుంభరాశిలో ప్రవేశించింది. జూన్ 5న శని వక్రమార్గం పట్టనుంది. ఇప్పుడు జూలై 12న వక్రమార్గం పడుతూనే శని రాశి పరివర్తనం, మకర రాశిలో ప్రవేశించనున్నాడు. శని గోచారం కారణంగా కొన్ని రాశులపై ఆ ప్రభావం పడుతోంది. కొన్ని రాశులు మాత్రం శని నుంచి విముక్తమవుతున్నాయి. జూలై 12వ తేదీ మరోసారి శని వక్రమార్గం పడుతూ మకర రాశిలో ప్రవేశించనుంది. ఈ నేపధ్యంలో 2 రాశులు మరోసారి శని బారిన పడనున్నాయి.
శనిగ్రహం ఈ మధ్యనే ఏప్రిల్ 29వ తేదీన కుంభరాశిలో ప్రవేశించింది. దీంతోపాటు మిధునం, తుల రాశి జాతకులకు శని నుంచి విముక్తి లభిస్తుంది. కర్కాటకం, వృశ్చిక రాశులు శని బారిన పడ్డాయి. ఇప్పుడు జూలై 12వ తేదీన శని మరోసారి మకర రాశిలో వక్రమార్గం పట్టనుంది. దాంతోపాటు ఈ రాశులు శని నుంచి విముక్తి పొందనున్నాయి. శని అవధి రెండున్నరేళ్లుంటుంది. ఈ సందర్భంగా శని వ్యక్తికి శారీరకంగా, మానసికంగా నష్టం కల్గిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూలై 12వ తేదీన శని దేవత వక్రావస్థలోనే మకర రాశిలో ప్రవేశించనుంది. దాంతోపాటు శని మరోసారి మిధునం, తుల రాశులు శనిబారిన పడనున్నాయి. ఇది 2023 జనవరి 17 వరకూ ఉంటుంది.
మిధునం, తుల రాశి జాతకులకు శని దుష్ప్రభావం ప్రారంభమవుతూనే..వ్యాపారంపై ప్రభావం కన్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో వైఫల్యం చవిచూడాల్సి వస్తుంది. అవసరమైన పనులు నిలిచిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలుండవు. మరోవైపు అవుతున్న పనులు కూడా నిలిచిపోతుంటాయి. ఆ వ్యక్తి కర్మ బాగుంటే మాత్రం శని ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతారు.
Also read: Mahalakshmi Yogam: బుధ, శుక్ర గ్రహాల కలయిక, మహాలక్మీ యోగం ఆ మూడు రాశులకే, డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి