Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్.. రూ.59 విలువ చేసే ఎల్‌జీ స్మార్ట్ టీవీ కేవలం రూ.21,990కే...

Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. బ్రాండెడ్ కంపెనీల వస్తువులపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2022, 03:05 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బిగ్ బచత్ ధమాల్ సేల్
  • జూన్ 3 నుంచి జూన్ 5 వరకు
  • స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు
Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్.. రూ.59 విలువ చేసే ఎల్‌జీ స్మార్ట్ టీవీ కేవలం రూ.21,990కే...

Flipkart Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌లో ఆఫర్ల జాతర నడుస్తోంది.'బిగ్ బచత్ ధమాల్ సేల్' పేరిట ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అతి చౌక ధరలకే విక్రయిస్తోంది. స్మార్ట్ టీవీల విషయానికొస్తే.. ఎల్‌జీ, శాంసంగ్, ఎంఐ, రియల్‌మీ తదితర బ్రాండ్లకు చెందిన ఫోన్లు చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. ఎల్‌జీలో 43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ రూ.22 వేల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ :

ఎల్‌జీ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.59,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.32,990కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అదనంగా మరో రూ.1009 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ లభించినట్లయితే రూ.31,981కే ఈ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.21,990కే :

ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత టీవీని మార్చుకున్నట్లయితే ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద టీవీ కండిషన్‌ని బట్టి రూ.11వేల వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే... రూ.32,990కి అందుబాటులో ఉన్న ఈ టీవీని కేవలం రూ.21,990కే పొందుతారు. అయితే డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి కండిషన్స్ వర్తిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆఫర్ ఆదివారం (జూన్ 5)తో ముగియనుంది. 

Also Read: Malla Reddy College: బ్రేకింగ్..మంత్రి మల్లారెడ్డి కాలేజీ బస్సులపై రాళ్ల దాడి

Also Read : Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News