Health Benefits Of Cinnamon: సాధారణంగా ఆహారం రుచిని పెంచేందుకు దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. కానీ చాలా సంవత్సరాలుగా ఇది అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది.
హెల్త్‌లైన్ ప్రకారం నివేదిక ప్రకారం.. దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని సూపర్ ఫుడ్ అని అంటారు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్, హెచ్ఐవి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, నరాల సంబంధిత వ్యాధులు మొదలైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దాల్చినచెక్క ప్రయోజనాలు:
యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా ఉంచుతుంది:
దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
వాపులను తగ్గిస్తుంది:
దాల్చినచెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది శరీర కణజాలంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
దాల్చినచెక్క టీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యాంటీ డయాబెటిక్ లక్షణాలు:
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి దాల్చిన చెక్క చాలా సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
ఆహారంలో దాల్చిన చెక్కను వాడితే.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి అనేక మానసిక సమస్యలు అదుపులో ఉంటాయి.
క్యాన్సర్‌ను దూరంగా ఉంచుతుంది:
క్యాన్సర్ రక్షణ, దాని చికిత్స సమయంలో దాల్చినచెక్క చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది.
గొంతులో మంట:
ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు ఎండుమిర్చి తేనెతో కలిపి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు తగ్గుతుంది.
స్థూలకాయాం:
దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది. ఊబకాయం సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను ఆహారంలో తీసుకుంటే ఊబకాయం సమస్య కూడా దూరమవుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది:
దాల్చిన చెక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
Also Read: Bitter Gourd Benefits: కాకరకాయను వీరు అస్సలు తినకూడదు..తింటే దుష్ప్రభావాలు తప్పవు..!!
Also Read: Weight Loss Fruit: ఈ పండుతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుకు చెక్ పెట్టండి..!!
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Fennel Oil For White Hair: సోపు నూనె వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook