Bhatti Comments: హిందూత్వం ఎవరి సొత్తు కాదు..బండి సంజయ్‌పై భట్టి విక్రమార్క ఫైర్..!

Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్‌తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 2, 2022, 04:31 PM IST
  • తెలంగాణలో పొలిటికల్ వార్
  • కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • బండి సంజయ్‌పై భట్టి విక్రమార్క విమర్శలు
Bhatti Comments: హిందూత్వం ఎవరి సొత్తు కాదు..బండి సంజయ్‌పై భట్టి విక్రమార్క ఫైర్..!

Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్‌తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ ఏమైనా బండి సంజయ్‌ ఒక్కడిదా అంటూ ఘాటుగా విమర్శించారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

భాగ్య లక్ష్మీ అమ్మవారిని తాము కూడా ఆరాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఎవరో చేసిన పనికి పార్టీది బాధ్యత ఎలా అవుతుందన్నారు. హిందూత్వం బండి సంజయ్‌ సొత్తు కాదని ఫైర్ అయ్యారు. భారత కాంగ్రెస్‌ భావజాలాన్ని వ్యతిరేకించడం అంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా కొనసాగడానికి అనర్హుడని అన్నారు.

మత విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలతో మధ్యయుగ కాలం నాటి పరిస్థితులు సృష్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ సర్కార్‌ చేసే పాపాల్లో టీఆర్ఎస్‌కు భాగస్వామ్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు..అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఏంటి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ వద్ద అమరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో అవరోధాలు వచ్చినా..సోనియా గాంధీ అధికమించారని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. 

Also read:Mekapati Vikram Reddy: ఆత్మకూరులో విజయం మాదే..నామినేషన్ వేసిన విక్రమ్‌రెడ్డి..!

Also read:SVP OTT Release Date: మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ఎస్‌వీపీ! పైసల్ కట్టాల్సిన అవసరం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News