/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Aadhaar Card Instructions: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన సూచనలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ కార్డు కాపీని ఎవ్వరితోనూ షేర్ చేయవద్దని అప్రమత్తం చేస్తోంది. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సివస్తోందంటోంది.

ఆధార్ కార్డు. నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారమైన కార్డు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కీలకమైన సూచనలు జారీ చేసింది. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీనైనా సరే ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు కాపీ దుర్వినియోగమవుతోందని చెబుతోంది. యూఐడీఏఐ జారీ చేసిన ప్రెస్ రిలీజ్‌లో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ దుర్వినియోగంపై సూచనలు జారీ అయ్యాయి.

డాక్యుమెంటేషన్ ప్రోసెస్‌లో భాగంగా ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త, తెలివి అవసరమంటోంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్. బయట పబ్లిక్ ప్రదేశాల్లో ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయవద్దని కూడా చెబుతోంది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే..సంబంధిత సిస్టమ్ నుంచి ఈ కాపీలను రీ సైకిల్ బిన్‌తో సహా డిలీట్ చేయించమని సూచిస్తోంది. 

ఆధార్ కార్డుని వివిధ రకాలుగా విభిన్న వ్యక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందని ప్రజల్ని హెచ్చరిస్తోంది. వివిధ సంస్థలకు ఆధార్ కార్డు కాపీ షేర్ చేయడం తప్పనిసరైతే మాత్రం..ఆ సంస్థలు ఆమోదయోగ్యమైనవో కాదో నిర్ధారించుకోవల్సిన అవసరముందని సూచిస్తోంది. హోటర్స్, సినిమా హాల్స్ వంటి ప్రదేశాల్లో ఆధార్ కార్డు కాపీలు సేకరించడంపై నియంత్రణ ఉంది. ఒకవేళ ఆ సంస్థలు అలా చేస్తే..ఆధార్ చట్టం 2016 ప్రకారం అది నేరంగా పరిగణిస్తారు. 

ఆధార్ కార్డును సురక్షితంగా ఎలా షేర్ చేయాలి

అందుకే మాస్క్ ఆధార్ కార్డును మాత్రమే షేర్ చేయాలని సూచిస్తోంది. ఈ విధానంలో చివరి నాలుగు ఆధార్ అంకెలే కన్పిస్తాయి. ఆధార్ నెంబర్ పూర్తిగా ఉంటే మాత్రం ఎవరైనా సరే యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. డౌన్‌లోడ్ చేసేముందు..మాస్క్డ్ ఆధార్ కార్డు కావాలా అనే ఆప్షన్ ఎంచుకోమని సూచిస్తోంది. 

ఆధార్ నెంబర్‌ను సురక్షితంగా వెరిఫై చేసుకునే విధానాన్ని కూడా యూఐడీఏఐ సూచిస్తోంది. ఆఫ్‌లైన్‌లో విధానంలో కూడా వెరిఫికేషన్ దశ సాధ్యమే. దీనికోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంఆధార్ మొబైల్ యాప్ ద్వారా సాధ్యమవుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది ఈ యాప్. ఆధార్ అనేది దేశంలో అంతర్గతంగా ఉపయోగించే కీలకమైన డాక్యుమెంట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని పాటిస్తూ మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా చూసుకోవల్సిన బాధ్యత మీపైనే ఉంది. 

Also read: Indigo Fined by DGCA: ఇండిగోపై డీజీసీఏ సీరియస్.. ఐదు లక్షలు జరిమానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Central government orders, not to share aadhaar card copy with any one or any organsiation
News Source: 
Home Title: 

Aadhaar Card Instructions: ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచనలు, ఎవరితోనూ నో షేరింగ్

Aadhaar Card Instructions: ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచనలు, ఎవరిలోనూ షేర్ చేసుకోవద్దంటూ ఆదేశాలు
Caption: 
Aadhaar card ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Aadhaar Card Instructions: ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచనలు, ఎవరితోనూ నో షేరింగ్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, May 29, 2022 - 13:28
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
79
Is Breaking News: 
No