Bandi Sanjay Sensational Speeh: తెలంగాణలో మదర్సాలను, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం: బండి సంజయ్

Bandi Sanjay Sensational Comments: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో వేలాది ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారన్న ఆయన.. ఆ మసీదులు తవ్వితే వాటి అడుగున శివలింగాలు బయటపడతాయని అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 12:56 AM IST
  • ఊపిరి ఉన్నంత వరకు హిందూ సమాజం కోసం పోరాడుతా..
  • లుచ్చా నా కొడుకులారా.. అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడిన బండి సంజయ్
  • లవ్ జిహాదీ అంటే లాఠీ రుచిచూపిస్తాం... మతమార్పిళ్లు చేస్తే మక్కెలిరిగదీస్తాం
Bandi Sanjay Sensational Speeh: తెలంగాణలో మదర్సాలను, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం: బండి సంజయ్

Bandi Sanjay Sensational Comments: వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో వేలాది ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారన్న ఆయన.. ఆ మసీదులు తవ్వితే వాటి అడుగున శివలింగాలు బయటపడతాయని అన్నారు. ''తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వి చూస్తే.. ఒకవేళ అందులో శవాలొస్తే అవి మీవి.... శివం వస్తే మావి. అందుకు మీరు సిద్ధమా ? అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను రద్దు చేస్తామని ప్రకటించారు. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో అధికారిక భాషగా ఉన్న ఉర్దూపై ఇక శాశ్వతంగా నిషేధం విధిస్తామని అన్నారు. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగి రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించి తీరుతామని మరోసారి పునరుద్ఘాటించారు. కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఉపన్యాసం ఆద్యంతం అనేక సంచలన వ్యాఖ్యలతో కొనసాగింది. 

ఊపిరి ఉన్నంత వరకు హిందూ సమాజం కోసం పోరాడుతా..
నాలో ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణలో ఉన్న హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు పోరాడుతూనే ఉంటానని బండి సంజయ్ అన్నారు. నన్ను కన్న నా కరీంనగర్‌, నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శతకోటి వందనాలు. ఆ శ్రీ రాముడికి హనుమంతుడు ఎలాగైతే చేదోడుగా వాదోడుగా ఉన్నాడో... అలాగే ఈ కరీంనగర్ ప్రజలకు ఏ ఆపదొచ్చినా వారికి రక్షణ కవచంగా నేనుంటా అని కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ హామీ ఇచ్చారు. 

లుచ్చా నా కొడుకులారా.. అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడిన బండి సంజయ్
బండి సంజయ్‌పై ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్న లుచ్చా నా కొడుకులారా అంటూ తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ కుటుంబం కోసం జైలుకు పోలేదని...ఇదే చౌరస్తాలో ఇండియా vs పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన లుచ్చా నా కొడుకులను తరిమి తరిమి కొట్టిన వ్యక్తినిరా అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

మతమార్పిళ్లు చేసిన వాళ్లను తరిమికొట్టినందుకు... నడిచౌరస్తాలో ఉన్న ఈద్గాను తొలగించడానికి యుద్దం చేసినందుకు... దుర్గా మాత ఉత్సవాలకు విద్యుత్ సరఫరా నిలిపేయడంపై యుద్దం చేసినందుకు జైలుకు పోయినోడురా బండి సంజయ్ అంటూ తనని విమర్శించేవారిపై మండిపడ్డారు. మూడుసార్లు చంపడానికి ప్రయత్నించినా ఎవ్వరికీ భయపడలేదు.. కాషాయం జెండాను వీడలేదు. అలాగే కరీంనగర్ గడ్డను కూడా విడిచిపెట్టిపోలేదురా అంటూ బండి సంజయ్ తనకు ఎదురైన పాత అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

ఇన్ని నేరాలు చేసినోళ్లకు వ్యతిరేకంగా బరాబర్ కొట్లాడతా..
కరీంనగర్ బస్టాండ్‌లో, కోరుట్లలో, జగిత్యాలలో, లుంబినీ పార్కులో, గోకుల్ చాట్‌లో, దిల్‌షుక్ నగర్ సాయి బాబా గుడిలో బాంబులు పెట్టి అమాయకుల ప్రాణాలు తీసింది మీరేరా అని మండిపడ్డారు. వరంగల్ నడిబొడ్డున నిరుపేద పూజారిని హత్య చేసింది మీరే... మొన్నటికి మొన్న నాగరాజును హత్య చేసింది కూడా మీరే.... అలాంటప్పుడు ఇలాంటోళ్లకు వ్యతిరేకంగా కొట్లాడలా ? వద్దా ? బరాబర్ కొట్లాడతా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో హిందూ సమాజాన్ని కాపాడాలంటూ నన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ హిందు సమాజమే నన్ను రాష్ట్రానికి పంపింది. అందుకే తెలంగాణ గడ్డను కాషాయమయం చేస్తున్నా. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేసి రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తా అని అన్నారు.

Also read : Hyderabad Honor Killings : హైదరాబాద్‌లో మరో పరువు హత్యకు విఫలయత్నం

Also read : CM Kcr Tour: రేపు తెలంగాణకు ప్రధాని..బెంగళూరుకు కేసీఆర్.. ఏం జరుగుతోంది..?

Also read : PM Modi Hyderabad Tour: 930 మంది విద్యార్థులకు 2 వేల మంది పోలీసులు.. మోడీ పర్యటనకు ఎందుకంత భద్రత?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News