Mango Season: వేసవి కాలం రాగానే అందరికీ మామిడి పండ్లు సులభంగా లభిస్తాయి. దీనిని తినడానికి ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడతారు. అందుకే మామిడి పండును పండ్లకి రారాజు అని పిలుస్తారు. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని.. అందుకే దీనిని ఇతర దేశాల్లో సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. మామిడిలో చాలా వరకు చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. కావున వీటిని తినడం వల్ల మధుమేహం వ్యాధి గ్రస్తులకు మరింత అనారోగ్యం పాలవుతారని అనుకుంటారు. కానీ నిపుణులు అశ్చర్యపోయే విషయాలను వెల్లడించారు. ఇప్పుడు ఆ విషయాలను తెలుసుకుందాం.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మామిడిపండ్లు హానికరమా..?
మామిడి పండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కావున పండ్లలోని కేలరీలు స్థాయి అధికంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెరను పెంచడానికి దోహదపడతాయని అందరికీ తెలుసు. అయితే మామిడి పండు తినే ముందు మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి. ఇందులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాల ఉండడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలపిన వివరాల ప్రకారం.. మామిడిలో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొంది. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేందుకు ఉండే కారకాలను ఒత్తిడిని తగ్గిస్తాయని వివరించింది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏమి తెలుసుకోవాలి..?
షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు మామిడి పండ్లను తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ కేవలం రోజుకు ఒకటి లేదా రెండు మామిడి ముక్కలను మాత్రమే తినాలని వారు సూచిస్తున్నారు. దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనానికి ముందు మాత్రమే తినాలని తెలుపుతున్నారు.
(NOTE: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read:Loose Motion: లూస్ మోషన్స్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆకులతో ఉపశమనం పొందండి..!!
Also Read: Amla And Honey Mix Benefits: ఉసిరికాయలో దీనిని కలపి తినండి.. మధుమేహం నుంచి ఉపశమనం పొందండి.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.