What is Sukanya Samriddhi Yojana Scheme: ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న కుటుంబంలో పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, పెళ్లి వంటి విషయంలో ప్రతి తల్లిదండ్రులు ఎంతో దిగులు చెందుతుంటారు. ముఖ్యంగా భవిష్యత్‌లో ఆడపిల్లల పెళ్లి ఎలా చేయాలా? అని పేద తండ్రి మదనపడుతుంటారు. అలాంటి వారి కోసమే ప్రధాని నరేంద్ర మోదీ 'సుకన్య సమృద్ధి యోజన' పొదుపు పథకం ప్రారంభించారు. 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు దీనిద్వారా పొందవచ్చు. ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఈ పథకం ఎంతో సాయంగా నిలుస్తోంది.
ఆడపిల్లల భవిష్యత్తును మెరుగుపరిచే లక్ష్యంతో 22 జనవరి 2015న 'సుకన్య సమృద్ధి యోజన' పొదుపు పథకంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ఖాతా వార్షిక వడ్డీ 7.6%గా ఉంది. క్యాలెండర్ నెలలోని ఐదవ రోజు ముగింపు మరియు నెలాఖరు మధ్యన అత్యల్ప బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కించబడుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో మీ ఖాతాలో వడ్డీ జమ చేయబడుతుంది. సుకన్య సమృద్ధి యోజనపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక పేరు మీద ఆమె సంరక్షకుడు (తండ్రి, తల్లి లేదా బంధువులు) తెరవవచ్చు. దేశంలోని ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవవచ్చు. అయితే ఒకే కాన్పులో కవల ఆడపిల్లలు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో మాత్రం రెండు కంటే ఎక్కువ ఖాతాలను తెరవడానికి అవకాశం ఉంది.
కనీసం రూ.250 డిపాజిట్ చేయడం ద్వారా సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ డబ్బును ఎన్ని వాయిదాలలో అయినా జమ చేయవచ్చు. లేదా ఒకేసారి కూడా కట్టుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద మినహాయింపు ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి బాలిక జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి. బాలిక సంరక్షకుడు లేదా తల్లిదండ్రుల చిరునామా మరియు ID ప్రూఫ్ అవసరం. ఈ ఖాతాను మీ దగ్గరలోని ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో తెరవవచ్చు. ఈ పథకం కింద వచ్చే డబ్బును బాలికకు 18 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు తీయడానికి వీల్లేదు. అలానే 18 ఏళ్ల తర్వాత పెళ్లి కోసం మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడపిల్ల పెళ్లికాకుంటే 21 ఏళ్ల తరవాత డబ్బు తీసుకోవచ్చు.
Also Read: Mahesh Babu Dance: మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన మహేష్ బాబు.. ఊగిపోయిన ఫాన్స్!
Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. ఈదురుగాలులు కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook