One Family One Ticket: ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చింతన్‌ శిబిర్‌ లో చర్చ, క్లారిటీ వచ్చే అవకాశం

One Family One Ticket: ఉదయ్‌ పూర్‌ లో కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఒక కుటుంబం ఒక్కటే టికెట్‌ పై చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఈ సమావేశాలు ముగిసేలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 01:00 PM IST
  • తెరపైకి ఒక కుటుంబం- ఒక్కటే టికెట్‌ నినాదం
  • చింతన్‌ శిబిర్‌ లో క్లారిటీ వచ్చే అవకాశం
  • ఇదే నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్లే అవకాశం..?
One Family One Ticket: ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చింతన్‌ శిబిర్‌ లో చర్చ, క్లారిటీ వచ్చే అవకాశం

One Family One Ticket: 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. అందులోభాగంగా ఉదయ్‌ పూర్‌ వేదికగా చింతన్‌ శిబిర్‌ సమావేశం నిర్వహిస్తోంది. మూడురోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు 2024 ఎన్నికల్లో గెలుపు రుచి చూడాలనే అంశాలపై కేడర్‌ కు పార్టీ అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఒక కుటుంబం- ఒక్కటే టికెట్‌ అనే అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. సీనియర్ లీడర్ల కొడుకులు, కుమార్తెలు రాజకీయాల్లో ఉండటంతో వారు కూడా టికెట్‌ ఆశిస్తుంటారు. అలా ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా టికెట్‌ పొందిన సందర్భాలు చూశాం. అయితే అలాంటి వారితో ఇతర నేతలకు టికెట్‌ దక్కకుండా పోతోంది. ఫలితంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువుతున్నాయి. వాటన్నంటికీ చెక్‌ పెట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ చింతన్‌ శిబిర్‌ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

ఒక కుటుంబం ఒక్కటే టికెట్‌ అనే విధానంతో ప్రధానంగా యువతకు ఎక్కువగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.  ఇదే అంశాన్ని పార్టీలో ఏర్పాటుచేసిన సబ్‌ గ్రూప్‌ హైకమాండ్‌ కు నివేదించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు.. రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే కర్ణాటకలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. హర్యానా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా.. అతని కుమారుడు దీపిందర్‌ హుడా రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. అంతేందుకు గాంధీ ఫ్యామిలీ నుంచే సోనియా, రాహుల్‌ ఇద్దరూ కూడా లోక్‌ సభ సభ్యులు ఉన్నారు.

కాంగ్రెస్‌ సబ్‌ గ్రూప్‌..ఒక కుటుంబానికి ఒక్కటే టికెట్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాంటప్పుడు నిజాయితీగా పనిచేసే కేడర్‌ కు అవకాశాలు వస్తాయని గుర్తుచేసింది. అయితే ఇటీవల ముగిసిన ఉత్తరాఖాండ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ నిబంధనను తుంగలో తొక్కింది. ఒకే కుటుంబం ఒకే టికెట్‌ అనే నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. చింతన్‌ శిబిర్‌ లో 422 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో 35 శాతం మంది యువత, 21 శాతం మంది మహిళలే ఉంటారు.

Also Read: India Covid: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, అయినా అప్రమత్తత అవసరమే..!

Also Read: Ycp Leaders: వైసీపీ నేతల మధ్య సఖ్యత కుదిరిందా..అధిష్టానం ఏం చెబుతోంది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News