కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక సాయం.. మోదీ ప్రకటన తర్వాత స్పందించిన కేసీఆర్...

CM KCR on Kamareddy Road Accident: కామారెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై ఎట్టకేలకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 02:15 PM IST
  • కామారెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై కేసీఆర్ స్పందన
  • ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
  • మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటన
కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక సాయం.. మోదీ ప్రకటన తర్వాత స్పందించిన కేసీఆర్...

CM KCR on Kamareddy Road Accident: కామారెడ్డి జిల్లా హసన్‌పల్లి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే తెలంగాణ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్రం ఎంతయితే పరిహారం ప్రకటించిందో... తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే పరిహారం ప్రకటించడం గమనార్హం. 

రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించేంతవరకూ తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకుందా... కేంద్రం స్పందించిన తర్వాత కూడా ఈ ఘటనపై స్పందించకపోతే బాగుండదనే ఉద్దేశంతోనే ఆర్థిక సాయం ప్రకటించిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గట్టి పొలిటికల్ వార్ నడుస్తున్న వేళ ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారితీసింది.

గతంలో కొండగట్టు ప్రమాద ఘటనపై కూడా ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. ఆ ఘటన జరిగిన దాదాపు నెల రోజులకు కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. అప్పటి ఘటనలో దాదాపు 57 మంది మృతి చెందగా... సీఎం కేసీఆర్ కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సినీ కుటుంబాల పెద్దలు చనిపోతే వెళ్లి పరామర్శించే కేసీఆర్‌కు సామాన్యుల మరణాలు పట్టవా అని చాలామంది నిలదీశారు. తాజాగా కామారెడ్డి ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ స్పందన తర్వాతే కేసీఆర్ స్పందించడం ఆలస్యంగా మేల్కొన్నారా అన్న విమర్శలకు తావిస్తోంది. 

Also Read: MLC Kavitha Vs MP Arvind: పసుపుకు ఇళ్లతో తో కౌంటర్.. ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు ఆందోళనతో నిజామాబాద్ లో రచ్చ..

Also Read: Kamareddy Road Accident: కామారెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి... మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News