/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Revanth Reddy Big Shock: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ టూర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రాహుల్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ లోకి పాత కాపులను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది. తాను కలిసేందుకు వస్తానని  రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినా.. కొండా స్పందించలేదట. దీంతో చాలా సేపు వెయిట్ చేసిన రేవంత్ రెడ్డి.. కొండాను కలవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు కొండా. పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకాన్ని స్వాగతించారు. రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చిందని కూడా కామెంట్ చేశారు. అలాంటి కొండా.. రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆసక్తి చూపకపోవడంపై రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

కొండా , రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కు సంబంధించి ఆదివారం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలవబోతున్నారని.. ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరుతారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు కొండా. తనను రేవంత్ రెడ్డి కలుస్తారని వచ్చిన వార్తలు అసత్యమని చెప్పారు. తాను కాంగ్రెస్ నేతలను ఎవరినీ కలవలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక కామెంట్లు చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం తాను న్యూట్రల్ గా ఉన్నానని తెలిపారు. కొత్త పార్టీ పెట్టాలా లేక ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరాలా అన్న దానిపై చర్చిస్తున్నానని తెలిపారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం ఉందని వెల్లడించారు.

రేవంత్ రెడ్డిని దూరం పెట్టడం... దానిపై తర్వాత కొండా ఇచ్చిన వివరణను బట్టి... ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.  ఈ వారంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు కొండా. పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ ను కలిసి చర్చించారు. పార్టీలో చేరికపైనే ఇద్దరి మధ్య చర్చలు సాగాయాని తెలుస్తోంది. బీజేపీ పెద్దలు కూడా కొండాతో మాట్లాడారని చెబుతున్నారు. దాదాపుగా ఆయన బీజేపీలో చేరడం ఖాయమని సమాచారం. ఈనెల 15న సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఆ సభలో కాకుంటే జూన్ 6న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. బీజేపీలో చేరడం ఖాయమైంది కాబట్టే.. రేవంత్ రెడ్డిని కలిసేందుకు కొండా ఇష్టపడలేదనే టాక్ వినిపిస్తోంది.

తన రాజకీయ గమనంపై స్పష్టత ఇచ్చిన కొండా... మరో బాంబ్ కూడా పేల్చారు. తాను, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకే ఆలోచనతో ఉన్నామన్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొంత కాలంగా కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్నారు కోమటిరెడ్డి. బీజేపీకి మద్దతుగా పలుసార్లు ఓపెన్ గానే కామెంట్ చేశారు. వరంగల్ రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరుకాలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ ను వీడాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.తాజాగా కొండా చేసిన కామెంట్లతో కోమటిరెడ్డి కూడా కమలం పార్టీలో చేరుతారని తెలుస్తోంది. కొండా, కోమటిరెడ్డి తీరుతో రేవంత్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయంటున్నారు. తాను ఆహ్వానించినా కొండా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపడం రేవంత్ రెడ్డికి దెబ్బేననే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇది జనాల్లో తమపై వ్యతిరేక ప్రచారం తీసుకువస్తుందని, కాంగ్రెస్ గెలుపుపై నమ్మకం లేకనే నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే సంకేతం జనాల్లోకి వెళుతుందని కొందరు పీసీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

READ ALSO: MLC Kavitha Vs MP Arvind: పసుపుకు ఇళ్లతో కౌంటర్.. ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు ఆందోళనతో నిజామాబాద్ లో రచ్చ..

READ ALSO: ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. పెళ్లయిన 36 రోజులకే! విష ప్రయోగం విఫలం కాగా.. రెండోసారి పక్కా స్కెచ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Tpcc Chief Revanth Reddy Faced Big Shock.. Konda Vishweshwer reddy Komatireddy Will Join Bjp Soon
News Source: 
Home Title: 

Revanth Reddy Big Shock: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కమలం గూటికి కొండా! అదే దారిలో కోమటిరెడ్డి..?

Revanth Reddy Big Shock: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కమలం గూటికి కొండా! అదే దారిలో కోమటిరెడ్డి..?
Caption: 
FILE PHOTO REVANTH REDDY
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్

రేవంత్ ను కలిసేందుకు ఇష్టపడని కొండా

బీజేపీ గూటికి చేరే యోచనలో కొండా, కోమటిరెడ్డి

Mobile Title: 
Revanth Reddy Big Shock: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కమలం గూటికి కొండా! అదే దారిలో క
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, May 9, 2022 - 13:15
Request Count: 
65
Is Breaking News: 
No