Telangana TDP: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా..?

Telangana TDP: తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందా..? రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతోందా..? ఆ పార్టీని మళ్లీ ప్రజలు ఆదరిస్తారా..? టీడీపీ నేతలకు బాబు ఎలాంటి మార్గనిర్దేశం చేశారు..? హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు పూర్వ వైభవం వస్తుందా..? తెలంగాణలో టీడీపీ పరిస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 01:38 PM IST
  • తెలంగాణపై చంద్రబాబు ఫోకస్
  • పార్టీ బలోపేతంపై నేతలతో చర్చ
  • మళ్లీ సత్తా చూపిస్తామంటున్న టీడీపీ నేతలు
Telangana TDP: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా..?

Telangana TDP: తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందా..? రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతోందా..? ఆ పార్టీని మళ్లీ ప్రజలు ఆదరిస్తారా..? టీడీపీ నేతలకు బాబు ఎలాంటి మార్గనిర్దేశం చేశారు..? హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు పూర్వ వైభవం వస్తుందా..? తెలంగాణలో టీడీపీ పరిస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.

తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్‌ భవన్‌లో ఆ పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌, సైబరాబాద్ ప్రాంతాలు మహానగరంలా మారాయన్న విషయాన్ని గుర్తు చేయాలన్నారు. మళ్లీ టీడీపీని ఆదరిస్తే అలాంటి సంక్షేమాన్ని అందిస్తామని ప్రజలకు వివరించాలన్నారు. 

తెలంగాణలో టీడీపీకి క్యాడర్ బలంగా ఉందని..ఉమ్మడి రాష్ట్రంలో ఇదే రుజువు అయిందని చంద్రబాబు గుర్తు చేశారు. నేతలు పోయినా.. ఉన్న క్యాడర్‌ను ఉపయోగించుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నేతలను ఆదేశించారు. దీని ద్వారా ప్రజల్లోకి వెళ్లొచ్చని సూచించారు. త్వరలో మహానాడు జరుగుతుందని నేతల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఒంగోలులో మహానాడు జరిగే అవకాశం ఉందని..అప్పటిలోపు సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. తెలంగాణలోని పరిస్థితులను నేతలను అడిగి తెలుసుకున్నారు.  

రాష్ట్ర ఆవిర్భావ తర్వాత టీడీపీ(TDP) సీనియర్ నేతలంతా వివిధ పార్టీల్లోకి వెళ్లారు. ఓటుకు నోటు కేసు అంశం తెరపైకి వచ్చిన తెలంగాణలో టీడీపీ తుడుచుపెట్టుకుపోయిందన్న వాదన ఉంది. టీడీపీ సీనియర్ నేతలంతా టీఆర్ఎస్‌(TRS), కాంగ్రెస్‌, బీజేపీల్లోకి జంప్‌ అయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్వీ రమణ సైతం గులాబీ గూటికి వెళ్లారు. దీంతో ఆ బాధ్యతలను బక్కని నరసింహులు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. ఈమేరకు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. త్వరలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో టీడీపీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో మరి..

Alsro read:Disha Patani: ప్రభాస్‌ సినిమాలో మరో బాలీవుడ్‌ భామ.. వెల్‌క‌మ్ చెపుతూ ఫ్ల‌వ‌ర్ బొకే!

Alsro read:Video: మదర్స్ డే స్పెషల్... తల్లి అంజనా దేవితో మెగా బ్రదర్స్ ఎమోషనల్ మూమెంట్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News