How to Please Lord Shani: శని దేవుడిని కర్మ దాత, న్యాయ దేవుడు అని కూడా అంటారు. శని దేవుడు ఒక వ్యక్తి మంచి, చెడులకు కర్మను నిర్ణయిస్తాడు. శనిదేవుని ఆగ్రహానికి మనుషులే కాదు దేవతలు కూడా భయపడతారు. అదే సమయంలో శని దేవుడి అనుగ్రహం సకల సమస్యల నుంచి బయటపడేస్తుంది. సూర్య దేవుడి తనయుడైన శని దేవుడి కృప పొందినవారి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. కష్టాల్లో, ఆపదలో ఉన్న వ్యక్తులు సైతం శని దేవుడి అనుగ్రహంతో వాటి నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం మూడు మంత్రాలు జపించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం పఠించాల్సిన మంత్రాలు :
1. వేద మంత్రం: 'ఓం శం నో దేవీరభీష్టాయ అపో భవన్తు పీఠే శం యోరభి స్రవంతు నః'
2. శని తాంత్రిక మంత్రం: 'ఓం శనైశ్చరాయ నమః'
3. శని బీజ మంత్రం: 'ఓం ప్రమ్ ప్రిం ప్రౌన్ సః శనిశ్చరాయ నమః'
ఈ పనులు చేయవద్దు :
మీరు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కష్టపడి పనిచేసే వారి పట్ల అగౌరవంగా వ్యవహరించవద్దు. మరిచిపోయి కూడా పేదలను, బలహీనులను అవమానించవద్దు. స్త్రీలను గౌరవించాలి. జంతువులకు హాని తలపెట్టవద్దు. ఒకవేళ ఎవరైనా వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై శని దేవుడు ఆగ్రహిస్తాడు.
శని అనుగ్రహం కోసం దానం చేయాల్సినవి :
శనివారం నాడు శనికి సంబంధించిన వస్తువులను దానం చేయడం ద్వారా.. ఆ వ్యక్తి జాతకంలో శని సంచారం బలపడుతుంది. తద్వారా శని దేవుడు సంతోషిస్తాడు. శనివారం దానం చేయాల్సిన వస్తువులు ఈ కింద ఇవ్వబడినవి.
నల్ల బట్టలు
నల్ల పప్పు
ఆవనూనె
నల్ల దుప్పటి
నల్లని గొడుగు
నల్ల ఆవు
నలుపు బూట్లు
గేదె
నీలమణి రాయి
ఏకముఖి రుద్రాక్షలను ధరించడం వల్ల కూడా శని దేవుడి అనుగ్రహం పొందవచ్చు. ఆ రుద్రాక్షను ధరించి శని దేవుడి మంత్రాలను జపించాలి. తద్వారా శని దేవుడు తన కరుణ, కటాక్షాలను కురిపిస్తాడు.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Mothers Day 2022: మదర్స్ డే స్పెషల్ విషెస్.. ఈ రోజంతా అమ్మతోనే సరదాగా గడిపేద్దాం!
Also Read: Rahul Gandhi On Kcr: కేసీఆర్ పేరు ఉచ్చరించని రాహుల్.. అసహ్యమా!వ్యూహమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook