Yadadri Parking Fee: యాదాద్రి కొండపై పార్కింగ్ ఫీజు విషయంలో యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. కొండపైకి వెళ్లే నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్‌కు అదనపు గంటగా నిర్ణయించిన 100రూపాయల రుసుము ఎత్తివేసింది. కొండపైకి వెళ్లే నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు మాత్రం యథాతథంగా 500రూపాయలుగా నిర్ణయించింది ఆలయ కమిటీ. ఇటీవలే పార్కింగ్ రుసుముపై ఉత్తర్వులు జారీ చేసింది ఆలయ కమిటీ. ఈ పార్కింగ్ బాదుడుపై సర్వత్వా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, నిధుల కేటాయింపుతో ఆగమశాస్త్రం ప్రకారం పునర్నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తుల రాక కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో తొలుత కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. అయితే అధికారులు మనసు మార్చుకుని కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించి భక్తుల నుంచి రుసుం వసూళ్లు చేయాలని ఐడియా వేశారు. కొండపై వాహనాలను పార్క్ చేస్తే.. గంట గంటకూ రేటు మారుతుందని ఇటీవల ప్రకటించారు. మొదటి గంటకు కారు పార్కింగ్ ఫీజును 500 రూపాయలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా మరో వంద రూపాయలు వసూలు చేస్తామన్నారు. ఆ వాహనాలకు క్యూ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బస్టాండుతో పాటు, వీఐపీ గెస్టుహౌజ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఛార్జీలు ఆదివారం(మే1) నుంచే అమల్లోకి వస్తాయని యాదాద్రి ఆలయ ఈవో గీత సర్క్యులర్ జారీ చేశారు. ఈ బాదుడు కేవలం.. సామాన్య భక్తులకే. వీఐపీలు, దాతలు, పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చిన వారికి రూల్స్ వర్తించవని పేర్కొన్నారు.
పెద్దమొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తామనడంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎయిర్ పోర్టుల్లో కూడా లేనంతగా ఛార్జీలు వసూలు చేయటమేంటని భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. యాదాద్రి ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఈ పార్కింగ్ ఫీజులపై తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ, కొండగట్టుతో పాటు ఏపీలోని తిరుపతి దేవస్థానంలోనూ పార్కింగ్ ఫీజు ఇంతలా ఉండదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజాగా యాదగిరీశుడి కొండపై వాహనాల పార్కింగ్ నిబంధనల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. పార్కింగ్ రుసుం 500 రూపాయలు అలాగే ఉంచి... గంట గంటకూ బాదుడుపై వెనక్కి తగ్గారు. గతంలో ప్రైవేటు వాహనాల రాకపోకలను నియంత్రించేందుకే ఛార్జీల ధరలను అధికంగా నిర్ణయించామని వైటీడీఏ అధికారులు ప్రకటించారు. తాజా నిర్ణయం భక్తులకు కాస్త ఊరటనిస్తోంది.
Also Read - Kavitha Vs Arvind Dharmapuri : ఎంపీ అర్వింద్‌పై కవిత ఫైర్.. అర్వింద్ సమాధానం ఏంటంటే..
Also Read - Kavitha Vs Arvind Dharmapuri : ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చిన అర్వింద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.