Swiggy Drone Services: ప్రముఖ ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ మరో సంచలనానికి తెరదీయనుంది. ఇక నుంచి డెలివరీ బాయ్‌లు కాదు..డెలివరీ ద్రోన్లు కన్పించనున్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఆ వివరాలు చూసేద్దాం..
స్విగ్గీ కేవలం ఫుడ్ డెలివరీ సేవలే కాకుండా గ్రాసరీ డెలివరీ సేవల్ని కూడా ఇన్‌స్టామార్ట్ పేరుతో అందిస్తోంది. అయితే ఇప్పుడిదే రంంలో స్విగ్గీ సరికొత్త సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టనుంది. అదే అమలైతే డెలివరీ రంగంలో ఓ సంచలనం కానుంది. ఇక నుంచి డెలివరీ బాయ్స్ కాకుండా..డెలివరీ ద్రోన్లు రానున్నాయి. ద్రోన్ సేవలందించే నాలుగు సంస్థలు గరుడా ఏరోస్పేస్, స్కై ఎయిర్, ఏఎన్ఆర్ఏ, టెక్ ఈగల్, మరుట్ ద్రోన్ టెక్ సంస్థలతో ఈ సేవలందించేందుకు స్విగ్గీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరులో పైలట్ ప్రాజెక్టుగా ట్రయల్స్ నిర్వహించింది.
నేరుగా కస్టమర్లకు ద్రోన్ సేవలా
కానేకాదు. ద్రోన్ ద్వారా డెలివరీ సేవలంటే నేరుగా కస్టమర్లకు కాదు. ప్రస్తుతానికి రిటైల్ డిస్ట్రిబ్యూటర్ లేదా అవుట్ లెట్లో ఉన్న సరుకుల్ని ఏరియో స్టోర్‌కు ద్రోన్ ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి స్విగ్గీ డెలివరీ బాయ్ కస్టమర్‌కు అందిస్తాడు. ఇలా చేయడం ద్వారా సమయం కలిసొస్తుందనేది స్విగ్గీ అంచనా. కరోనా లాక్డౌన్ సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోన్ సహాయంతో మందులు డెలివరీ చేసేందుకు ట్రయల్స్ నిర్వహించాయి. ఇందులో భాగంగా గురుగ్రామ్ కేంద్రంగా లాజిస్టిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఢిల్లీ వేరి సంస్థ ద్రోన్ డెలివరీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ద్రోన్లు తయారు చేసే కాలిఫోర్నియాకు చెందిన ట్రాన్సిషన్ రోబోటిక్స్ కొనుగోలు చేయనుంది. ఇప్పుడు సరుకుల రంగంలో కూడా ద్రోన్ వినియోగం ప్రారంభమైతే...ఇక ఓ సంచలనే కానుంది.
Also read: LIC IPO Opens: ప్రారంభమైన జంబో ఎల్ఐసీ ఐపీఓ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook