TTD Governing Council: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..ఇవే..!

TTD Governing Council: సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. సర్వ దర్శనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. త్వరలో భక్తులకు టైం స్లాట్ టోకెన్లు కేటాయించాలని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 04:07 PM IST
  • టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
  • శ్రీవారి దర్శనం సులభతరం చేసేలా నిర్ణయం
  • సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు
TTD Governing Council: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..ఇవే..!

TTD Governing Council: సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. సర్వ దర్శనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. త్వరలో భక్తులకు టైం స్లాట్ టోకెన్లు కేటాయించాలని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేని భక్తులకు దర్శనాన్ని కల్పించాలన్నారు పాలక మండలి సభ్యులు. 

నడక దారి భక్తులకు కూడా మునుపటిలా దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.500 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలాన్ని అక్కడి ప్రభుత్వం కేటాయించదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ నిర్మాణానికి రేమండ్ సంస్థ ముందుకొచ్చిందన్నారు. ఆలయ నిర్మాణానికి రూ.60 కోట్ల వరకు విరాళం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనికి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 

శ్రీవారి మెట్టు మార్గంలో మరమ్మతులు పూర్తైయ్యాని స్పష్టం చేశారు. మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి రూ.3.61 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఎస్వీడబ్ల్యూ యూనివర్సిటీలో రూ.1.20 కోట్లతో రెండు బ్యాక్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. తిరుపతిలో శ్రీనివాసేతు నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు.

ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో మరమ్మతులు, పటిష్ఠ చర్యలకు రూ.20 కోట్లు నిధుల కేటాయింపు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. తిరుమలలో గదుల మరమ్మతులకు రూ.19 కోట్లు నిధులు మంజూరైయ్యాయి. ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌కు 2.86 ఎకరాల స్థలం కేటాయించారు. చెత్త వ్యర్థాలతో బయో గ్యాస్ తయారీ చేసి అన్నప్రసాదం తయారీకి ఉపయోగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. 

టీటీడీలో విరాళాలను పద్దతిలో మార్పులు తీసుకొచ్చారు. నగదు, వస్తు రూపంలో విరాళాలు ఇచ్చే దాతలకు దర్శన, వసతి వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగాస్థులకు ఇళ్ల స్థలాలు కేటాయింపుపై ప్రత్యేక అధికారిని నియమించారు. తిరుమలో ఉద్యోగుల క్వార్టర్స్‌లను మరమ్మతులకు నిధులు కేటాయించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  రూ.240 కోట్లతో శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని..  మే 5న సీఎం జగన్(CM JAGAN) శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. 

తిరుమలలో ఇప్పటివరకు కేటాయించిన దుకాణాలు, లైసెన్స్‌లను క్రమబద్దీకరించి..లీగర్ హైర్ చేయాలని పాలక మండలి తీర్మానం చేసింది. తిరుమలకు మూడో మార్గం నిర్మాణానికి అనుమతులు ఇంకా రాలేదని..అనుమతులు వచ్చాక మామండూరు మీదుగా మెట్ల మార్గం నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి..పాలక మండలి నిర్ణయాలను వెల్లడించారు. 

Also read:Viral News: తన మూత్రాన్ని తానే తాగుతున్న యువకుడు... ఇది 'నిత్య యవ్వన' సీక్రెట్ అట...

Also read:Weight Gain Reasons: బరువు పెరగడాని అతిపెద్ద 4 కారణాలు, మీరు కూడా ఈ తప్పులు చేయోద్దు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News