India Power Crisis:దేశంలో కరెంట్ కష్టాలు.. 42 ప్యాసింజర్ రైళ్లు రద్దు

India Power Crisis:దేశంలోని విద్యుత్ ప్లాంట్ల దగ్గర కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కాని ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్లాంట్ల దగ్గర ఒక రోజుకు సరిపడా కోల్ కూడా లేదు. అలాంటి ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 06:59 PM IST

    దేశంలో పెరిగిపోతున్న కరెంట్ కష్టాలు

    బొగ్గు నిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్

    42 ప్యాసింజర్ రైళ్లు నిరవధికంగా రద్దు

India Power Crisis:దేశంలో కరెంట్ కష్టాలు.. 42  ప్యాసింజర్ రైళ్లు రద్దు

India Power Crisis:దేశంలో కరెంట్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడంతో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో కరెంట్ వాడకం పెరిగిపోయింది. సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఏపీలోనూ కరెంట్ కొరత తీవ్రంగా ఉంది. పలు జిల్లాల్లో పవర్ హాలీడే ప్రకటించారు.

దేశంలో కరెంట్ కష్టాలు పెరగడంతో సంక్షోభ నివారణకు కేంద్ర సర్కార్ నడుం బిగించింది. పవర్ ప్లాంట్లకు కోల్ సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణాకు ఆటంకం కలగకుండా కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు రవాణా చేసే రైళ్లకు లైన్ క్లియర్ చేసేందుకు.. ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది  కేంద్ర రైల్వే శాఖ. మొత్తం 42 రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.దేశంలో కరెంట్ కష్టాలు తీవ్రంగా ఉండటంతో త్వరలో మరిన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెల చివరి వరకు దాదాపు 650కి పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే యోచనలో మోడీ సర్కార్ ఉందంటున్నారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు ఎక్స్ ప్రెస్, మెయిల్ రైళ్లను కూడా ఆపేయబోతున్నారని సమాచారం. రైళ్ల రాకపోకలను నిలిపివేయడం తాత్కాలికమేనని.. కరెంట్ కష్టాలు తీరాకా మళ్లీ ఎప్పటిలానే పునరుద్దరిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

దేశంలోని విద్యుత్ ప్లాంట్ల దగ్గర కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కాని ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్లాంట్ల దగ్గర ఒక రోజుకు సరిపడా కోల్ కూడా లేదు. అలాంటి ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ఢిల్లీలో కరెంట్ సంక్షోభం తీవ్రంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే హాస్పిటల్స్ , మెట్రో రైళ్లకు కరెంట్ కట్ చేసే పరిస్థితి ఉందని కేజ్రీవాల్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీలైనంత త్వరగా బొగ్గును అందించాలని ఢిల్లీ మంత్రి కేంద్రాన్ని కోరారు.

READ ALSO: Indian Students In China: దెబ్బకు దిగొచ్చిన చైనా, భారత విద్యార్థులకు అనుమతి..!!

Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు గమనిక.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News