Telangana CM KCR:వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? పార్టీ ప్లీనరీ వేదికగా నేతలు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం ఉంటుంది. దళిత బంధు కలిసి వస్తుందా..? తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
ముచ్చట మూడోసారి అధికారం చేపట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఆ మేరకు పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాలకు పదును పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుక వేదిక నుంచి నేతలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. 8 ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే పార్టీ నేతలకు సూచించారు. ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు.
రేపు హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి పనులను పర్యవేక్షించారు. రాజకీయ వ్యూహాకర్త పీకేతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల ఇరువురి మధ్య రెండురోజులపాటు కీలక సమావేశం జరిగింది. ప్రగతి భవన్ వేదికగా చర్చలు జరిగాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ సైతం ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సమర శంఖం పూరించారు.
బీజేపీయేతర శక్తిగా ఎదుగేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇదివరకే ఆయన పలువురు ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమైయ్యాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంతోపాటు ఎంపీ సీట్లన్నీ కైవసం చేసుకోవాలని గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎంపీ సీట్ల అధికంగా సాధించడం ద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు.
2014 ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్ఎస్(TRS) 63 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 21, టీడీపీ 15, ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచాయి. తెలంగాణ సెంటిమెంట్‌తోనే టీఆర్ఎస్ గెలిచిందని ప్రతిపక్షాలతోపాటు రాజకీయ పండితులు విశ్లేషించారు. ఐతే ఆ తర్వాతి ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ విజయఢంకా మోగించింది. 2018లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 87 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిపొందారు. వరుసగా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
గతంలోలాగే ఈసారి కూడా సీఎం కేసీఆర్(KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్తాడా అన్న చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడోసారి ఒకే పార్టీ విజయం సాధించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వరుసగా రెండుసార్లు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతతో ఓటమి రుచి చూశాయి. మరి ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
Also read:Csk Ms Dhoni: ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు..ఏమిటది!
Also read:Karnataka Bible Controversy: హిజాబ్ ఘటన తర్వాత కర్ణాటకలో ఇప్పుడు మరో వివాదం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.