China Corona Lockdown Update: చైనాలో కరోనా (Covid-19) కల్లోలం సృష్టిస్తోంది. అతి పెద్ద నగరమైన షాంఘైలో అయితే రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డాగ్రన్ కంట్రీ అక్కడ కఠినమైన లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే, అక్కడి పరిస్థితులకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గోనె సంచుల్లో కుక్కలు, పిల్లులు నింపబడ్డాయి. వీటిన్నంటినీ రోడ్డు పక్కన ఉంచారు.
వివరాల్లోకి వెళితే...
చైనాలో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో.. షాంఘైలో (Shanghai Lockdown) ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్ కొనసాగుతోంది. అక్కడ ఎవరికైనా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ రోగుల యెుక్క పెంపుడు జంతువులను చంపివేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ లో షేర్ చేయబడింది.
26 million people in lockdown in Shanghai.
People are committing suicide from their balconies and Pets from people getting tested positive for #Covid are being collected to be killed and slaughtered in #Shanghai / #China
This is pure evil!
— Enes FREEDOM (@EnesFreedom) April 16, 2022
ఈ వీడియోను అప్ లోడ్ చేస్తూ..'షాంఘైలో 26 మిలియన్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. అంతేకాకుండా ప్రజలు తమ బాల్కనీల నుండి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే కరోనా పాజిటివ్ గా గుర్తించబడిన వారి పెంపుడు జంతువులను చంపడానికి సేకరిస్తున్నారు'' అంటూ రాసుకొచ్చారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, లాక్ డౌన్ కారణంగా ఆకలిని తట్టుకోలేని ప్రజలు కిరాణా దుకాలను లూటీ చేస్తున్నారు. అందుకే డ్రోన్ల ద్వారా ప్రజలను పర్యవేక్షిస్తున్నారు అక్కడి అధికారులు,
Also Read: Corona Fourth Wave: దేశంలో కరోనా భయం, భారీగా పెరిగిన మరణాలు..ఫోర్త్‌వేవ్ ఏం చేయనుంది..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook