'శ్రీరెడ్డి లీక్స్': ఆధారాలు బయటపెట్టేసింది

సుచిలీక్స్ తరహాలో టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కూడా పరిశ్రమలో తనతో క్లోజ్‌గా ఉన్నవారి ఫోటోలను లీక్ చేయడం ప్రారంభించింది.

Last Updated : Mar 27, 2018, 02:14 PM IST
'శ్రీరెడ్డి లీక్స్': ఆధారాలు బయటపెట్టేసింది

సుచిలీక్స్ తరహాలో టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కూడా పరిశ్రమలో తనతో క్లోజ్‌గా ఉన్నవారి ఫోటోలను లీక్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు తనతో సాన్నిహిత్యంగా ఉన్న ఓ వ్యక్తి ఫోటోను ఫేస్‌బుక్‌లో  షేర్ చేసింది. అయితే ఆ వ్యక్తి ఫోటోను పూర్తిగా కనిపించకుండా పెట్టడంతో శ్రీరెడ్డి కావాలనే పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని, లీక్స్ అంటూ ముఖాలు కనిపించనీయకుండా  ఫోటోలు పెట్టడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

టాలీవుడ్‌లో ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. పరిశ్రమలోని కొందరు పెద్దలు సినిమా అవకాశాల పేరుతో ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నారని పలువురు నటీమణులు బాహాటంగా ప్రకటిస్తున్నారు. రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లతో పాటు ఇటీవల నటి శ్రీరెడ్డి కూడా ఇండస్ట్రీలోని కొందరు పెద్దలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Trending News