Saunf Side Effects: సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే కొంతమంది మాత్రం సోంపు తినకూడటమే మంచిదంటున్నారు వైద్యులు.
సాధారణంగా సోంపు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంటారు వైద్యులు. నిజమే ఇది. భోజనం తరువాత లేదా ఏదో ఒక సమయంలో సోంపు తినడం మంచి అలవాటే. అలాగని అతిగా తీసుకోవడం మంచిది కాదు. కానీ కొన్ని రకాల పరిస్థితుల్లో సోంపు తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో పరిశీలిద్దాం.
సోంపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్కిన్ ప్రోబ్లమ్స్ ఎదురవుతాయి. సోంపుతో చర్మం చాలా సెన్సిటివ్ అయిపోతుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ మీకు తరచూ తుమ్ముల సమస్య ఉంటే..సోంపు తినడం మానేయండి. లేకపోతే మీ సమస్య మరింతగా పెరగవచ్చు.
బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలు కూడా సోంపు తినడం మంచిది కాదు. మీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. సోంపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే తల్లీ పిల్లలిద్దరికీ నష్టం కలుగుతుంది. సోంపు ఎక్కువ మోతాదులో తింటే..ఎలర్జీ రావచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా ఏదైనా మందులు తీసుకునే అలవాటుంటే..దాంతోపాటు సోంపు తీసుకోవద్దు. సోంపు ఎక్కువగా తింటే కడుపు నొప్పి కలుగుతుంది. అందుకే ఎక్కువ మోతాదులో సోంపు తీసుకోవద్దు.
Also read: Best Vitamins: ఆ కీలకమైన పదహారు విటమిన్లు విరివిగా లభించే ఆహార పదార్ధాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Saunf Side Effects: సోంపు మంచిదా కాదా..ఆ సమస్య ఉంటే సోంపు ఎందుకు తినకూడదు