/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

IPL SRH vs RR Updates: ఐపీఎల్‌లో ఇవాళ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా రాజస్తాన్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ అర్ధ శతకంతో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. శాంసన్ కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో శాంసనే టాప్ స్కోరర్.

అంతకుముందు, ఓపెనర్లు బట్లర్, యశస్వి జైస్వాల్ రాజస్తాన్‌కు మంచి శుభారంభం అందించారు. ఇద్దరు కలిసి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆరో ఓవర్ తొలి బంతికి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బట్లర్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 75 పరుగుల వద్ద బట్లర్ కూడా ఔటయ్యాడు. ఓపెనర్లు ఔటవడంతో క్రీజులోకి వచ్చిన శాంసన్, దేవదత్ పడిక్కల్ క్రీజులో కదం తొక్కారు. ఇద్దరు బౌండరీలు బాదుతూ స్కోర్‌ను పరుగులు పెట్టించారు. 

దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 2 సిక్స్‌లు 4 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించాడు. కేవలం 13 బంతుల్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లో వాషింగ్టన్ సుందర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలోనే 47 పరుగులు ఇచ్చాడు. నటరాజన్, ఉమ్రన్ మాలిక్ చెరో రెండు వికెట్లు తీయగా... భువనేశ్వర్, రొమారియో షెఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు. 

Also Read: Ananya Panday Pics: పచ్చ గౌనులో పొడుగుకాళ్ల సుందరి అనన్యా పాండే

Jana Gana Mana: 'జన గణ మన' కథ ఎలా ఉండబోతుందో చెప్పిన పూరి జగన్నాథ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ipl Rajasthan Royals sets big target for Sunrisers Hyderabad
News Source: 
Home Title: 

SRH vs RR: సంజు శాంసన్ మెరుపు హాఫ్ సెంచరీ... హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం...

SRH vs RR: సంజు శాంసన్ మెరుపు హాఫ్ సెంచరీ... హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం...
Caption: 
IPL SRH vs RR Scores: (Image source : Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఐపీఎల్‌ ఇవాళ హైదరాబాద్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్

దంచికొట్టిన రాజస్తాన్ కెప్టెన్ సంజు శాంసన్

హైదరాబాద్ టార్గెట్ 211 పరుగులు 

Mobile Title: 
SRH vs RR: సంజు శాంసన్ మెరుపు హాఫ్ సెంచరీ... హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం...
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, March 29, 2022 - 21:42
Request Count: 
63
Is Breaking News: 
No