Deepak Hooda, Ayush Badoni fifties help Lucknow set 159 targrt to Gujarat: ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ పోరాడే స్కోర్ చేసింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసి.. గుజరాత్ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాప్ ఆర్డర్ విఫలమయినా.. దీపక్ హుడా (55; 41 బంతుల్లో 6x4, 2x 6), ఆయుష్ బదోని (54; 41 బంతుల్లో 4x4, 3x 6) జట్టును ఆదుకున్నారు. అద్భుత హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవమైన స్కోర్ అందించారు. ఇన్నింగ్స్ చివరలో కృనాల్ పాండ్యా 13 బంతుల్లో 21 రన్స్ చేశాడు. గుజరాత్ పేసర్ మొహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు మొహ్మద్ షమీ భారీ షాక్ ఇచ్చాడు. మ్యాచ్ మొదటి బంతికే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. రెండో ఓవర్ మూడో బంతికి క్వింటన్ డీకాక్ (7)ను షమీ ఔట్ చేయగా.. మూడో ఓవర్ మూడో బంతికి ఎవిన్ లూయిస్ (10)ను వరుణ్ ఆరోన్ వెనక్కి పంపాడు. ఇక నాలుగో ఓవర్ మూడో బంతికి మనీష్ పాండే (6)ను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో లక్నో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది.
Innings Break!
Brilliant half-centuries from @HoodaOnFire (55) and Ayush Badoni (54) propel #LSG to a total of 158/6 on the board.
Scorecard - https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL pic.twitter.com/iBTHG7nbVl
— IndianPremierLeague (@IPL) March 28, 2022
ఈ సమయంలో దీపక్ హుడా, ఆయుష్ బదోనీ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. క్రీజులో కుదురుకున్నాక హుడా బ్యాట్ ఝుళిపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు బదోనీ
కూడా వేగం పెంచాడు. బౌండరీలు బాదిన హుడా హాఫ్ సెంచరీ చేశాడు. హుడా వెనుతిరగడంతో బాదుడు బాధ్యతను బదోనీ తీసుకున్నాడు. మరోవైపు కృనాల్ పాండ్యా కూడా వేగంగా ఆడటంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 158/6 స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లతో చెలరేగగా.. వరుణ్ ఆరోన్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ ఔట్!!
Also Read: Vijay-Puri: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబోలో మరో మూవీ.. రేపే లాంచింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook