Post Office Scheme: దేశంలోని వివిధ బ్యాంకులు డబ్బు పొదుపు చేసేవారి కోసం ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కానీ, ఇండియా పోస్ట్ ఆఫీస్ కూడా అనేక పెట్టుబడులపై ఎక్కువ మొత్తంలో వడ్డీని ఇస్తుంది. కిసాన్ వికాస్ పత్ర అనే పథకం ద్వారా దీర్ఘకాలికంగా డబ్బు పొదుపు చేసేవారికి రెట్టింపు వడ్డీని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఇవ్వనుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడి దారులు తమ భవిష్యత్తు కోసం లేదా పిల్లల చదువులు, పెళ్లి వేడుకల కోసం డబ్బును దాచుకోవచ్చు.
ఈ వడ్డీతో డబ్బు రెట్టింపు\
ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర పథకంలో తమ డబ్బును పెట్టిన పెట్టుబడిదారులకు రూ. 6.9 శాతం వార్షిక వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీరేటుతో కిసాన్ వికాస్ లెటర్ ప్లాన్‌లో మీ పెట్టుబడులు 124 నెలలు లేదా దాదాపు 10 సంవత్సరాల సమయం తర్వాత మీ పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. ఉదాహరణకు.. మీ పెట్టుబడి రూ. 10 లక్షలు అయితే, 124 నెలల్లో అది 20 లక్షలుగా మారుతుంది.
కిసాన్ వికాస్ పత్ర గురించి వివరాలు
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కింద మీరు కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడులకు గరిష్ట పరిమితి లేదు. పోస్టాఫీసులో మీకు రూ. 1000, 2000, 5000, 10,000.. రూ. 50,000 వంటి పొదుపునకు గానూ.. అగ్రిమెంట్స్ ను పెట్టిబడిదారులకు అందిస్తారు.
ఏ వయసు వాళ్లు అర్హులు?
18 ఏళ్లు పైబడిన పెట్టుబడిదారులు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ పెట్టుబడిదారులకు ఈ పథకం కింద ఒకటి లేదా ఉమ్మడి ఖాతాలను తెరిచే అవకాశాన్ని ఇస్తుంది. గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాలను తెరవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కూడా తమ పిల్లల పేరుతో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తర్వాత అందుకు నామినీలను ఎంచుకోవచ్చు.
Also Read: Diesel Price Hike: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. మరో రూ.25 పెరిగిన లీటర్ డీజిల్ ధర!
Also Read: Two Numbers One Sim: ఒకే సిమ్ తో రెండు నంబర్లు యాజ్ చేయడం ఎలానో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe