Murder in fight over Mutton: ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఇతరుల జీవితాల్లో విషాదం నింపుతున్నాయి. ఒక మాంసం ముక్క ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మాంసం కోసం మొదలైన కొట్లాట చిలికి చిలికి గాలివానలా మారి యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
కడప టౌన్‌కు చెందిన శివ, షేర్ ఖాన్ స్నేహితుల మధ్య ఓ ఫంక్షన్లో మాంసం ముక్కల కోసం గొడవ జరిగింది. తనకు షేర్ ఖాన్ ముక్కలు తక్కువ వేశాడని శివ ఘర్షణ పడ్డాడు. క్షణికావేశంతో షేర్ ఖాన్‌ను కత్తితో గాయపరిచాడు శివ. అక్కడున్నవాళ్లు శివను అడ్డుకోవడంతో అక్కడికి ఆ గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే గొడవను మనసులో పెట్టుకొని శివపై షేర్ ఖాన్ ప్రతీకారంతో రగిలిపోయాడు. ఇటీవల ఓరోజు శివకు ఫోన్ చేసి మాట్లాడుదాం రమ్మని పిలిపించాడు. శివ అక్కడికి వెళ్లాక షేర్ ఖాన్ అతనితో గొడవపడ్డాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన షేర్ ఖాన్ కత్తితో శివ గొంతు కోసం హత్య చేశాడు. హత్యానంతరం తన స్నేహితుల సాయంతో శివ మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కేసీ కేనాల్ కాలువ పక్కన పడేశాడు. శివ హత్యపై కేసు నమోదు చేసిన కడప టూ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శివారెడ్డి తెలిపారు.
ఇలా మాంసం ముక్కల కోసం హత్యలు జరిగిన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా కన్నాపురంలో చికెన్ వండలేదని సొంత చెల్లెలిని అన్న హత్య చేసిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. చికెన్ తీసుకొచ్చి వండమని చెల్లెలిని అన్న కోరగా... నీరసంగా ఉందని వండే ఓపిక లేదని ఆమె బదులిచ్చింది. అదంతా తనకు తెలియదని.. వచ్చేసరికి చికెన్ వండి పెట్టాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటిరోజు ఉదయం ఇంటికి వచ్చిన అతను.. అప్పటికీ చికెన్ కర్రీ వండకపోవడంతో చెల్లెలిపై ఆగ్రహంతో రగిలిపోయి గొడ్డలితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
Also Read: KGF Chapter 2: మీరు అతనికి అడ్డు నిలబడకండి సార్.. 'తూఫాన్' వచ్చేసింది!!
Also Read: The Kashmir Files: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఫ్రీగా చూడొచ్చని కక్కుర్తి పడితే.. అంతే సంగతులు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook