Komatireddy Rajagopal Reddy on Party Change: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారా అన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల అసెంబ్లీలో మంత్రి తలసానితో మాటల యుద్ధం సందర్భంగా కాంగ్రెస్ నేతలు తనకు మద్దతుగా నిలబడలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గౌరవం లేని చోట ఉండలేనని.. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై ఫైట్ చేస్తానని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కింద పడితే వారి కింద పనిచేయలేనని... తనను నమ్మినవారు వెంట రావొచ్చునని పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ గతంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీకి మద్దతుగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కానీ కొన్నాళ్లకే ఆ వ్యవహారం మరుగున పడిపోయింది.
తాజా అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి పార్టీ మార్పు అంశం మళ్లీ తెర పైకి వచ్చింది. పేకాట అడేవాళ్లు మంత్రులు అయితే లేనిది కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓవైపు మంత్రులు తనపై దూకుడుగా మాట్లాడుతుంటే.. కాంగ్రెస్ సభ్యుల నుంచి ఆశించిన మద్దతు దొరకలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై ఫైట్ చేస్తానని రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు.. ఆయన పార్టీ మార్పుకు సిద్ధమవుతున్నారనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో.. కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: Jhulan Goswami ODI Wickets: చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా క్రికెటర్ జులన్ గోస్వామి!
Also Read: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook