Ind vs SL 2nd Test Day 2 Higlights: టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో (IND vs SL pink ball Test) రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 28/1తో నిలిచింది. కుశాల్ మెండిస్ (16*), కరుణరత్నె (10*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా (Jasprit Bumrah) ఒక వికెట్ తీశాడు. మరో మూడు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో..లంక విజయం సాధించాలంటే మరో 419 పరుగులు చేయాలి.
STUMPS on Day 2 of the 2nd Test.
Sri Lanka are 109 & 28/1 in response to #TeamIndia's 252 & 303/9d.
Scorecard - https://t.co/t74OLq7xoO #INDvSL @Paytm pic.twitter.com/yYyBHLj5MC
— BCCI (@BCCI) March 13, 2022
86/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆదివారం రెండో రోజు ఆట ప్రారంభించిన లంకను భారత బౌలర్లు దెబ్బతీశారు. దీంతో 5.5 ఓవర్లలో 23 పరుగులే చేసి లంక (srilanka) చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో లంక తొలి ఇన్నింగ్స్ 109 పరుగుల వద్ద ముగిసింది. బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో భారత్ కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో లంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ (67; 87 బంతుల్లో 9 ఫోర్లు), రిషభ్ పంత్ (50; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. పంత్ కేవలం 28 బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. దీంతో తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (46; 79 బంతుల్లో 4 ఫోర్లు), హనుమ విహారి (35) రాణించారు. లంక బౌలర్లలో జయవిక్రమ నాలుగు వికెట్లు, ఎంబుల్దేనియా (Embuldeniya) మూడు వికెట్లు తీశారు.
Also read: India vs Sri Lanka 2nd Test: ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్...టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ind vs SL: రెండో రోజు ఆటపూర్తి.. లంక ముందు భారీ లక్ష్యం