Stocks today: మూడో రోజూ లాభాలు- లోహ, బ్యాంకింగ్ షేర్లు భళా!

Stocks today: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. బీఎస్​ఈ 1.50 శాతం, ఎన్ఎస్​ఈ 1.53 శాతం పెరిగాయి. లోహ, బ్యాంకింగ్ షేర్లు అధికంగా లాభాలను గడించాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 03:55 PM IST
  • స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాల జోరు
  • 55 వేల మార్క్ దాటిన సెన్సెక్స్​
  • లోహ, బ్యాంకింగ్ షేర్లకు భారీ లాభాలు
Stocks today: మూడో రోజూ లాభాలు- లోహ, బ్యాంకింగ్ షేర్లు భళా!

Stocks today: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు పెరుగుతున్న నేపథ్యంలో సూచీలు లాభాలను నమోదు చేశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 817 పాయిట్లు పెరిగి 55,464 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 249 పాయింట్ల లాభంతో 16,595 వద్ద స్థిరపడింది.

కారణాలివే..

ఇటీవల వరుస నష్టాలకు కారణమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడిప్పుడే సద్ధుమనుగుతున్న నేపథ్యంలో సానుకూలతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలు చర్చల దిశగా సమస్యల పరిష్కారానికి అడుగులు వేయడం కలిసొచ్చింది. దీనితో మూడు రోజులుగా సూచీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్​గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్​ మినహా.. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్​, గోవాల్లో బీజేపీ ఆధికారంలోకి రానున్నట్లు దాదాపు ఖరారైంది. ఇక పంజాబ్​లో ఆప్​ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ పరిణామాలు కూడా మార్కెట్ల లాభాలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

సూచీల కదలికలు ఇలా..

ఇంట్రాడేలో సెన్సెక్స్ 53,242 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 54,982 కనిష్ఠానికీ పడిపోయింది.

నిఫ్టీ అత్యధికంగా 16,757 పాయింట్ల స్థాయిని తాకింది. ఓ దశలో 17 వేల మార్క్ కోల్పోయి.. 16,447 వద్దకూ తగ్గింది.

నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..

హిందుస్థాన్ యూనీలీవర్​ 5.17 శాతం, టాటా స్టీల్​ 4.27 శాతం, ఎస్​బీఐ 3.45 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.28 శాతం, యాక్సిస్​ బ్యాంక్ 3.12 శాతం లాభాలను గడించాయి.

టెక్ మహీంద్రా 1.48 శాతం, డాక్టర్ రెడ్డీస్​ 0.78 శాతం, టీసీఎస్​ 0.36 శాతం నష్టాలను నమోదు చేశాయి.

Also read: Bank Loans: బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశాలివే

Also read: Interest Rates: కోటక్ మహీంద్రా గుడ్‌న్యూస్, ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News