AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ తొందరలోనే ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారని చెప్పారు.ఏపీలో ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించిన జగన్ ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ అందుకు సిద్దంగా ఉందన్నారు.
ముందస్తు ఎన్నికలకు వచ్చినా జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు చంద్రబాబు. మంగళగిరిలో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో సీఎం జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. ఏపీలో మహిళలకు రక్షణే లేదన్నారు.
మద్యపానం నిషేధం పేరు చెప్పి.. ప్రభుత్వం చీప్ లిక్కర్ విక్రయిస్తోందని అన్నారు చంద్రబాబు. ఆ చీప్ లిక్కర్ తాగడం వల్ల ఎంతో మంది మహిళలు భర్తలను కోల్పోయారని ఆరోపించారు. అమ్మ వడి ద్వారా మహిళలకు డబ్బులు ఇచ్చి.. న్నాన్న బుడ్డి ద్వారా అంతకన్నా ఎక్కువగా లాగేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అసలు ప్రభుత్వానికి మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు.
Also read: CM Jagan: మహిళలకు 51శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం AP: సీఎం జగన్
Also read: Jagan Illegal Assets Case: ఎంపీ రఘురామ పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు- టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం
ఏపీలో ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు జోస్యం
మహిళా దినోత్సవ ప్రత్యేక సభలో వ్యాఖ్యలు
జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు