Singareni Coal Mine Accident: పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం రామగుండం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల్లో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆ ప్రచారంపై కార్మికుల ఆగ్రహం :
అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో నలుగురు కార్మికులు చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ గని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 86 లెవల్ వద్ద మొత్తం 8 మంది కార్మికులు పనిచేస్తుండగా పైకప్పు కూలినట్లు తెలిపారు. వీరిలో నలుగురు క్షేమంగా ఉన్నారని.. మిగతా నలుగురు శిథిలాల కింద ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. కార్మికులను శిథిలాల కింద నుంచి బయటకు తీసుకొచ్చేందుకు 2, 3 గంటల సమయం పట్టవచ్చునని చెబుతున్నారు. ప్రమాదానికి సింగరేణి యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని... అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి :
గని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ సింగరేణి అధికారులను ఆరా తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని, మరి కాసేపట్లో పూర్తి వివరాలు అందుతాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు.
జాడి వెంకటేష్ అనే కార్మికుడిని కాపాడిన రెస్క్యూ టీమ్ :
శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికుల్లో జాడి వెంకటేష్ అనే కార్మికుడిని రెస్క్యూ టీమ్ కాపాడింది. చికిత్స నిమిత్తం వెంకటేష్‌ను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తోన్న ప్రమాదాలు :
గతేడాది నవంబర్‌లో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్ఆర్పీ-3 గనిలో చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం రూ.1కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రమాదం జరిగిన కొద్దిరోజులకే మందమర్రి రీజియన్‌లోని కల్యాణి ఖని ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన మరో ప్రమాదంలో పురుషోత్తం అనే అండర్ మేనేజర్ మృతి చెందాడు. ఇలా వరుసగా జరుగుతున్న గని ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: TS Budget 2022: తెలంగాణ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు- హైలైట్స్ ఇవే..
Also read: elangana Budget 2022: బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు.. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook