Bheemla Nayak Pre-release Event: 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రేజీ గెస్ట్స్...నెట్టింట వైరల్ అవుతున్న లిస్ట్...

Bheemla Nayak Pre-release Event: 'భీమ్లా నాయక్' రిలీజ్ కు ముందే ఇంట్రెస్టింగ్ రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 12:58 PM IST
Bheemla Nayak Pre-release Event: 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రేజీ గెస్ట్స్...నెట్టింట వైరల్ అవుతున్న లిస్ట్...

Bheemla Nayak Pre-release Event: 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) రిలీజ్ కు ముందే క్రేజీ రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నెల 25న మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. 

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, నటసింహం బాలకృష్ణ, జక్కన్న రాజమౌళి ముఖ్య అతిధులుగా వచ్చే అవకాశం ఉందనే ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎలాగైనా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను (Bheemla Nayak Pre-release Event) మరో 2 రోజుల్లో నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్​ బోర్డు యూ బై ఏ సర్టిఫికేట్​ జారీ చేసింది.  విడుదల తేదీని ప్రకటించినప్పటికీ.. ట్రైలర్​ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.  

పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Hero Rana) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'భీమ్లానాయక్'. ​ఇందులో నిత్యామీనన్, సంయుక్తా మీనన్​లు హీరోయిన్లుగా నటించారు. సాగర్​ కే చంద్ర దర్శకుడు.  మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ డైలాగ్స్ అందించారు. స్రీన్​ప్లే కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే అందించారు. ఎస్​.తమన్​ మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. ఇది మలయాళంలో సూపర్ హిట్​గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియన్​'కు రీమేక్​గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్​, హారిక & హాసిని క్రియేషన్స్​ బ్యానర్లపై నాగవంశి, ఎస్​.రాధా కృష్ణ నిర్మించారు. 

Also Read: Bhimla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్​ పూర్తి- 25న మూవీ రిలీజ్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News