RCB buy Hyderabad CP CV Anand Son Chama Milind for 25 lakhs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిళింద్ ఆనంద్.. తన కనీస ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అతడిని రూ. 25 లక్షలకు కైవసం చేసుకుంది. ఈ యంగ్ ప్లేయర్లతో అద్భుతమైన బ్యాకప్‌ను ఆర్సీబీ సెట్ చేసుకుంది. దేశవాళీ క్రికెట్లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ క్రికెటర్‌గా ఇదివరకే మిలింద్ మంచి గుర్తింపు పొందాడు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిళింద్ ఎడమ చేతి బ్యాటర్. అలాగే ఎడమ చేతి మీడియం బౌలర్‌గా కూడా రాణిస్తున్నాడు. బౌలింగ్ చేయడం అతని ప్రధానాస్త్రం. మిళింద్ లిస్ట్-ఏలో 45 మ్యాచ్‌లు ఆడి 82 వికెట్లను పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 6/43. డొమెస్టిక్‌లో 53 టీ20 మ్యాచ్‌లల్లో ఆడిన మిలింద్ 83 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్.. ఎనిమిది పరుగులిచ్చి అయిదు వికెట్లను పడగొట్టడం. 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లల్లో 85 వికెట్లు తీసుకున్నాడు.
20 ఏళ్ల చామ మిళింద్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. హైదరాబాద్ జట్టు, టీమిండియా అండర్-19 జట్టులో సభ్యుడు కూడా. ఆసీస్ లెఫ్ట్ ఆర్మర్ మిచెల్ జాన్సన్, టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లను ఎక్కువగా ఇష్టపడతాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల పర్యటన కోసం భారత అండర్-19 జట్టులోనూ ఆడిన మిలింద్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీలో చోటు దక్కించుకోవడంతో మరింత రాటుదేలే అవకాశం ఉంది.
Joining RCB’s #ClassOf2022:
Name: Chama Milind
Price: 25 LakhsWelcome to the family! 🤩#PlayBold #WeAreChallengers #IPLMegaAuction #IPL2022 #IPLAuction pic.twitter.com/NJ37GzqRa4
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2022
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా క్రికెటరే కావడం విశేషం. ఇంటర్ యూనివర్శటీ టోర్నమెంట్లల్లో ఆయన ఆడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం కూడా వహించారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు సీవీ ఆనంద్ అండర్-19లో ఆడారు. ఇంగ్లండ్‌లో ఆయన పర్యటించారు. ఇప్పుడు ఆయన కుమారుడు చామ మిళింద్ కూడా క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. జాతీయ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read; IPL 2022 Auction: సన్‌రైజర్స్‌లోకి ముగ్గురు ఆల్‌రౌండర్లు.. ఇక ప్రత్యర్దులకి చుక్కలే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook