Anantapur JNTU: అనంతపురంలోని జేఎన్‌టీయూలో జూనియర్స్‌పై సీనియర్స్ దారుణాలకు పాల్పడ్డారు. ఇటీవల రాత్రి పూట ఇద్దరు జూనియర్స్‌ను.. సీనియర్స్ తమ హాస్టల్‌లోకి తీసుకెళ్లారు. తర్వాత వారిని దుస్తులు విప్పి నిలబెట్టారు. తాము చెప్పిన పని చేయాలంటూ జూనియర్స్‌ని.. సీనియర్స్ బెదిరించారు.
అయితే సీనియర్స్ వేధింపులను తట్టుకోలేకపోయిన జూనియర్లు ప్రిన్సిపాల్‌కు కంప్లైట్ చేశారు. దీంతో పద్దెనిమిది మంది సీనియర్లపై వేటు పడింది. వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ సుజాత వెల్లడించారు. కాగా అనంత జేఎన్‌టీయూ (JNTU) చరిత్రలో ఇలా 18 మంది స్టూడెంట్స్‌పై (Students) సస్పెండ్ వేటుపడడం ఇదే తొలిసారి.
అనంత జేఎన్‌టీయూలో ఉన్నతాధికారుతో పాటు పోలీసులు, తదితరులతో కలిసి ఏర్పాటైన ర్యాగింగ్ నిరోధక కమిటీ ఈసారి యూనివర్సీటిలో (University) ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహించలేదు.
ఇక అనంత జేఎన్‌టీయూలో సీనియర్స్‌కు.. (Seniors) జూనియర్స్‌కు హాస్టల్స్ వేర్వేరుగా ఉన్నా కూడా సీనియర్ విద్యార్థులు ఇలా ర్యాగింగ్‌లతో (Raging) చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మిడ్‌నైట్ టైమ్‌లో జూనియర్స్‌ను తమ హాస్టల్స్‌కు బలవంతంగా తీసుకెళ్లి.. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు సీనియర్స్.
వారిని అర్ధనగ్నంగా నిలబెట్టి వేధిస్తుంటారు ఈ సీనియర్స్. జూనియర్స్ దుస్తులు విప్పించి డ్యాన్స్‌లు చేయిస్తుంటారు. తమకు మద్యం, సిగరెట్స్ తీసుకురావాలంటూ సీనియర్స్.. జూనియర్స్‌ను (Juniors) బలవంతం చేస్తుంటారు. గంటల తరబడి నిలుచోబెట్టి వేధిస్తుంటారు.
Also Read: Shahid Kapoor trolled: 'క్రికెటర్‌గా సినిమా తీస్తూ.. క్రికెట్‌పై కనీస అవగాహన లేదా?'
Also Read: Case on Youtuber Sarayu: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ, యూట్యూబర్ సరయూపై కేసు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook