Yash Dhull dancing six video goes viral: భారత యువ జట్టు అండర్-19 ప్రపంచకప్ 2022 ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అంటిగ్వా వేదికగా బుధవారం జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించింది. భారత్ నిర్దేశించి 290 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ 41.5 ఓవర్లో 194 పరుగులకే ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 289 రన్స్ చేసింది. కెప్టెన్ యశ్ ధుల్ సెంచరీ (110) చేయగా.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (94) రాణించాడు. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ అమితుమీ తేల్చుకోనుంది.
టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ యశ్ ధుల్ తన ఇన్నింగ్స్‌లో ఊహించని షాట్ ఒకటి ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్ టామ్ విట్నీ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్ ఐదో బంతిని యష్ ధుల్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. అయితే బంతి షార్ట్ పిచ్ కాగానే ఫ్రంట్ ఫుట్కు వచ్చిన భారత కెప్టెన్.. వైరటీ డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి లాంగాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్ టాప్‌లో పడింది.
WHAT A HIT 🔥
Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4
— ICC (@ICC) February 3, 2022
భారత జట్టు యువ కెప్టెన్ యశ్ ధుల్ కొట్టిన డాన్సింగ్ సిక్స్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఐసీసీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ కామెంట్ చేసింది. 'ఒక్క క్లాసిక్ సిక్స్‌తో ఐసీసీ ప్లే ఆఫ్ ది డే అవార్డు సంపాదించాడు. ఇంతకీ యష్ ధుల్ కొట్టిన సిక్స్‌కు క్రికెట్ పుస్తకాల్లో ఏ పేరుందో కొంచెం చెప్పండి' అంటూ ఐసీసీ పోస్ట్ చేసింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం.. తుపాకులతో దుండగుల కాల్పులు!!
Also Read: Ante Sundaraniki Release Date: ‘అంటే సుందరానికీ!’ సినిమా కోసం సమ్మర్ సీజన్ ను బ్లాక్ చేసిన హీరో నాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook